ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛను కానుక పంపిణీ పథకం మొదలైంది. ఇది అవ్వాతాతలకు వేడుకగా వైకాపా శ్రేణులు జరుపుకుంటున్నాయి. ఆగస్టు 2022 నాటికి మొత్తం 62.70 లక్షల మందికి పింఛను రూపంలో రూ.1594.66 కోట్ల రూపాయలను పంపిణీ చేశారు. ముఖ్యంగా, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతియేటా ఆగస్టు నెలల్లో ఇచ్చిన పింఛను వివరాలను పరిశీలిస్తే,
గత 2019 ఆగస్టులో రూ.1248 కోట్లు, 2020 ఆగస్టులో రూ.1416 కోట్లు, 2021 ఆగస్టులో రూ.1355 కోట్లు, 2022లో రూ.1595 కోట్లు చొప్పున పంపిణీ చేశారు. వైఎస్ఆర్ పింఛను కానుక పథకం కింద పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం నుంచి ప్రారంభమైంది.
ఇందుకోసం ప్రభుత్వం రూ.1594.66 కోట్లను గ్రామ వార్డు సచివాలయాలకు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ మొత్తాన్ని సచివాలయ సిబ్బంది, వలంటీర్లు బ్యాంకుల నుంచి డబ్బును డ్రా చేసి ఐదు రోజుల్లో పంపిణీ చేయాలని అధికారులు గడువు విధించారు. దీంతో గురువారం తెల్లవారుజాము నుంచే ఈ పింఛను పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.