Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రాకు బల్క్ డ్రగ్ పార్కును కేటాయించిన కేంద్రం : థ్యాంక్స్ చెప్పిన సోము

Advertiesment
somu veerraju
, గురువారం, 1 సెప్టెంబరు 2022 (15:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో వరం ఇచ్చింది. బల్క్ డ్రగ్ పార్కును కేటాయించింది. తూర్పుగోదావరి జిల్లా కేసీ పురంలో ఈ బల్క్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రధాని మోడీతో పాటు బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.
 
"ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. తూర్పుగోదావరి జిల్లా కేపీ పురంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆమోదం తెలుపుతూ ఏపీ సర్కారుకు కేంద్రం లేఖ రాసింది. రాష్ట్ర ప్రజానికం తరపున ప్రధాని నరేంద్ర మోడీకి, జేపీ నడ్డాకు ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డీమార్ట్‌లో జనసైనికుల చోరీ చేసినట్టు దుష్ప్రచారం...