వినాయకచవితి పేరుతో దేవుళ్ళను కించపరుస్తున్నారు -ప్రకాష్ రాజ్
, శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (07:05 IST)
జిహ్వకో రుచి.. అన్నట్లు మనుషులు రకరకాల మనస్తత్వాలతో ప్రవర్తించడం మామూలే. కానీ దేవుడిని రకరకాలుగా అనుకరిస్తూ చూపిస్తున్న విధానం చాలా తప్పని ప్రవచనకర్తలు, ఆధ్మాత్మిక గురువులు మైకులలో ఘోషిస్తున్నారు. ఇందుకు హిందూ ఆత్మత్మిక స్వామిజీలుకూడా విన్నవించినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇది కలియుగంలో వింత పోకడ. కలి ప్రభావం అంటూ పలువురు వ్యాఖ్యానించడం మామూలే. మనం భక్తితో చేసే పని కొందరి మనోభావాలు దెబ్బతీస్తున్నాయంటూ సీనియర్ నటుడు ప్రకాష్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినాయకచవితి సందర్భంగా పలు చోట్ల పలురకాలుగా గణపతి ప్రతిమలు పెట్టి వారువారు తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. కొందరు రాజకీయనాయకుల ఫొటోలు పెడితే, మరికొందరు సినిమా రంగానికి చెందిన కెజి.ఎఫ్., పుష్ప తరహా ప్రతిమలు పెట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు. వీటిని పలువురు పలురకాలుగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో భాగంగానే కొన్ని ఫొటోలు పెట్టి, ఇవి మన మనోభావాలను దెబ్బతీయడం లేదా. అంటూ ప్రకాష్ ప్రశ్నిస్తే ఎందరో ఆయనకు మద్దతు తెలిపారు. అసలు మనం చేసే పనివల్లే హిందూ దేవుళ్ళపై ఇతరులకు చులకగా మారిందని మరికొందరు స్పందించారు. ఇతర మతాలవారు ఇలా చేయడం ఎప్పుడైనా చూశామా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మరి వీటికి కాలమే జవాబు చెప్పాలి.
తర్వాతి కథనం