మెగాస్టార్ చిరంజీవి నిన్న వినాయకచవితినాడు సినిమా ఇండస్ట్రీ గురించి అసలు చెప్పాడు. చాలా సినిమాలు ఆడకపోతే ఆ సినిమాలో కంటెంట్‌లేదు. కాస్టింగ్ సరిగ్గాలేదు. దర్శకుడు, హీరో సరైన రూటులో వెల్లడంలేదని విశ్లేషకులు తెలియజేస్తారు. దీన్ని చాలామంది ఆహ్వానించరు. అలాంటిదే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా. అసలు ఈ సినిమా ఎందుకు తీశారో అర్థంకాలేదని అందరూ విశ్లేషించారు. రెండోరోజు థియటర్‌లో జనాలు లేరు. అందుకే త్వరగా ఓటీటీకి అమ్మేశారు.
ఆ విషయాన్ని చాలామంది తెలియజేసినా ఇంతవరకు తన సినిమా గురించి చిరంజీవి బయట చెప్పలేదు. కానీ వినాయకచవితినాడు ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఇప్పుడు కంటెంట్ ఉంటేనే థియేటర్స్ లో జనం వస్తున్నారని ఒకవేళ లేకపోతే రెండో రోజు నుంచే జనం రారని అందుకు ఉదాహరణగా నా సినిమానే ఒకటి అని చెప్పేశారు. సో. చిరంజీవి నిజాన్ని ఒప్పుకున్నారని కొందరు అభినందిస్తున్నారు.