మెక్సికో నగరంలో విద్యార్థులపై విష ప్రయోగం జరిగింది. కేవలం రెండు వారాల్లో విద్యార్థులపై ఈ తరహా ఘటన జరగడం ఇది రెండోది కావడం గమనార్హం. దక్షిణ మెక్సికో రాష్ట్రమైన చియాపాస్‌లో గ్రామీణ మాధ్యమిక పాఠశాలలో 57 మంది విద్యార్థులపై గుర్తు తెలియని పదార్థంపై విష ప్రయోగం చేశారని స్థానిక అధికారులు వెల్లడించారు. వీరిలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలినవారి పరిస్థితి నిలకడగా ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు.
కాగా, మెక్సికో నగరంలో ఈ తరహా విష ప్రయోగం జరగడం ఇది మూడోది కావడం గమనార్హం. గత రెండు వారాల్లో మూడు సార్లు విద్యార్థులపై విష ప్రయోగం జరిగినట్టు తెలుస్తుంది. బోచిన్ ప్రాంతానికి చెందిన 57 టీనేజ్ విద్యార్థులు విషయపూరిత లక్షణాలతో స్థానిక ఆస్పత్రిలో చేరారని, ఒక విద్యార్థిని ఉన్నతాసుపత్రికి తరలించినట్టు చెప్పారు. మిగిలిన విద్యార్థుల పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.