Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీర్యం నింపిన సింజరితో మహిళను గుచ్చిన వ్యక్తి.. 25 యేళ్ల జైలు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (09:31 IST)
కొన్ని నేరాలు విచిత్రంగా ఉంటాయి. కానీ అలాంటి నేరాలకు పడే శిక్షలు చాలా కఠినంగా, గరిష్టంగానూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఓ వ్యక్తికి 25 యేళ్ల జైలుశిక్ష పడింది. వీర్యం నింపిన సిరంజితో మహిళను గుచ్చిన ఓ వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించిన అమెరికా న్యాయస్థానం తీర్పునిచ్చింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఒహాయోకు చెందిన థామస్ స్టీమెన్ (52) అనే వ్యక్తి కిరాణా దుకాణానికి వచ్చిన మహిళకు స్టీమెన్ వెనుక నుంచి సిరంజితో గుచ్చాడు. ఆమెకు చురుక్కుమనడంతో ఏదో కుట్టిందని భావించిన బాధిత మహిళ నిందితుడిని ప్రశ్నించింది. దీనికి అతడు సిగరెట్‌తో కాల్చినట్టు చెప్పాడు. దీనిపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
అయితే, పోలీసులకు నిందితుడు ఇచ్చిన వాంగ్మూలంలో పురుగు కుట్టినట్టు ఉంటుందని చెప్పాడు. ఇదే విషయాన్ని పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత విచారణలో అతడు వీర్యం నింపిన సిరంజితో దాడి చేసినట్టు తేలింది. అంతేకాదు, మరో ఇద్దరు మహిళలపైనా స్టీమెన్ ఇలానే దాడికి యత్నించినట్టు పోలీసులు గుర్తించారు. 
 
అలాగే, తన ముందు నడుస్తున్న 17 ఏళ్ల యువతిపై వీర్యం చల్లాడు. స్టీమెన్ ఇంటిని తనిఖీ చేసిన సమయంలో ద్రవంతో కూడిన ఓ సిరంజిని పోలీసులు గుర్తించారు. 9 సిరంజిలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో స్టీమెన్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం తొలుత అతడికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత ఈ శిక్షను పదేళ్లకు కుదిస్తూ తుదితీర్పు వెలువరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments