Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీకాళహస్తిలో పట్టపగలు నడిరోడ్డుపై ఇనుప రాడ్లతో యువకుడి దారుణ హత్య

Advertiesment
శ్రీకాళహస్తిలో పట్టపగలు నడిరోడ్డుపై ఇనుప రాడ్లతో యువకుడి దారుణ హత్య
, గురువారం, 9 సెప్టెంబరు 2021 (16:52 IST)
పట్టపగలు నడిరోడ్డుపై యువకుడిని దారుణంగా హత్య చేసారు దుండగులు. ఈ ఘటన శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
శ్రీకాళహస్తిలో ఇమ్రాన్ ఖాన్ అనే యువకుడు రోడ్డుపై వెళుతుండగా కొందరు గుర్తు తెలియని దుండగలు అతడిని అడ్డగించారు. అతడితో వాగ్వాదం చేస్తూనే ఇనుప రాడ్లు తీసుకుని గొడ్డును బాదినట్లు బాదారు.
 
ఆ సమయంలో వాహనాలలో వెళుతున్నవారు కూడా ఆ భీతావహ ఘటనను చూసి వెనక్కి తిరిగి పారిపోయారు. పాతగొడవల నేపధ్యంలో ఇమ్రాన్ పైన దాడి చేసి వుండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇమ్రాన్ పలువురితో గొడవ పడుతుండేవాడనీ, అందువల్ల వారే ఈ పని చేసి వుంటారని పోలీసులు నిర్థారణకు వచ్చారు. సీసీ టీవీ ఫుటేజిలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరాటాకు 5 శాతం జీఎస్టీ ట్యాక్స్ శ్లాబ్.. సామాన్యుడికి దూరం