Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమకు నిరాకరించిందనీ యువతి గొంతు కోసం యువకుడు.. ఎక్కడ?

Advertiesment
Suryapet
తన ప్రేమను తిరస్కరించడాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు.. ఆ యువతి గొంతుకోశాడు. షేవింగ్ బ్లేడుతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ దారుణం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన బాధిత యువతి (18) తల్లిదండ్రులు ఏడాది కాలంగా నేరేడుచర్లలో ఉంటున్నారు. యువతి తండ్రి ఆయుర్వేదం మందులు విక్రయిస్తుంటాడు. గుంటూరులో బంధువుల ఇంట్లో ఉంటున్న యువతి అప్పుడప్పుడు నేరేడుచర్ల వచ్చి వెళ్తుండేది.
 
ఈ క్రమంలో 10 రోజుల క్రితం నేరేడుచర్ల వచ్చిన యువతిని చూసిన స్థానిక యువకుడు బాలసైదులు (23) ఆమె వెంటపడడం మొదలుపెట్టాడు. ప్రేమిస్తున్నానంటూ వేధించసాగాడు. అయితే, తనకు తన మేనమామతో తనకు వివాహం నిశ్చయమైందని చెప్పినా అతడు వినిపించుకోలేదు. 
 
ఈ క్రమంలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో మరో బాలికతో కలిసి దుస్తులు ఉతికేందుకు యువతి వెళ్లింది. ఇది గమనించిన సైదులు అక్కడికి చేరుకుని బ్లేడుతో యువతి గొంతుకోసి పరారయ్యాడు. 
 
దీంతో వెంటనే స్థానికులు యువతిని 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని, ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరెంట్‌ బిల్‌ చూసి ఆ హోటల్‌ యజమాని షాక్‌.. ఏమైందంటే?