Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హత్య కేసులో నిందితురాలు.. వివస్త్రను చేసి - కళ్ళలో కారం పోసి ఊరేగింపు...

Advertiesment
Brutal Attack
తెలంగాణా రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఓ మహిళ పట్ల కొందరు అమానుషంగా ప్రవర్తించారు. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఈమెను వివస్త్రను చేసి కళ్లలో కారం చల్లి ఊరంతా నగ్నంగా ఊరేగించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం రాజునాయక్‌తండాకు చెందిన శంకర్‌నాయక్ అనే వ్యక్తి గత జాన్ నెల 13వ తేదీన హత్యకు గురయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు.. అదే ఊరికి చెందిన మహిళను అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత ఆమె బెయిలుపై విడుదలై గ్రామానికి వచ్చింది. హత్యకు గురైన శంకర్‌నాయక్ బంధువులతో  పాతకక్షలు ఉండడంతో ఆమె తన సోదరి ఇంట్లో ఉంటోంది.
 
ఈ క్రమంలో తండాలో బంధువు ఒకరు మృతి చెందడంతో శనివారం అక్కడికి వెళ్లింది. ఆమెను అక్కడ చూసి కోపంతో ఊగిపోయిన శంకర్‌నాయక్ బంధువులు ఆమెను పట్టుకుని దాడిచేశారు. 
 
ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి వివస్త్రను చేశారు. ఆపై కళ్లలో కారంపోసి, కర్రలతో కొడుతూ నగ్నంగా వీధుల్లో తిప్పారు. దాదాపు గంటసేపు ఈ పాశవిక దాడి జరిగింది. అందరూ కళ్లప్పగించి చూశారే తప్పితే ఒక్కరు కూడా అడ్డుకోవడానికి ముందుకు రాకపోవడం గమనార్హం.
 
ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకున్న మహిళ ఎంపీటీసీ సభ్యురాలు శాంతాబాయి ఇంటికి పరుగులు తీసింది. శాంతాబాయి ఆమె ఒంటిపై దుస్తులు కప్పి రక్షణ కల్పించింది. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు తండాకు చేరుకుని బాధిత మహిళను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొంగుతున్న కొండ‌వీటి వాగు... స్పందించిన ఇరిగేష‌న్ అధికారులు