Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరెంట్‌ బిల్‌ చూసి ఆ హోటల్‌ యజమాని షాక్‌.. ఏమైందంటే?

Advertiesment
కరెంట్‌ బిల్‌ చూసి ఆ హోటల్‌ యజమాని షాక్‌.. ఏమైందంటే?
, గురువారం, 9 సెప్టెంబరు 2021 (21:45 IST)
Hotel
హోటళ్లకు కరెంటు బిల్లు వందల్లో లేదా వేలల్లో వస్తుంటుంది. కానీ ఓ హోటల్‌కు వచ్చిన కరెంట్‌ బిల్‌ చూసి ఆ హోటల్‌ యజమాని షాక్‌కు గురయ్యారు. పూట గడవడం కోసం ఏదో ఓ చిన్న హోటల్‌ నడుపుకుంటుంటే.. సెప్టెంబర్‌ నెలలో వచ్చిన కరెంట్‌ బిల్‌ చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. 
 
ఎందుకంటే.. తన జీవితాంతం ఆ హోటల్‌ నడిపి సంపాదించినా.. తన మొత్తం ఆస్తులను ఆమ్మినా కూడా ఆ బిల్లు కట్టలేరు. ఇంతకీ విద్యుత్‌ అధికారులు ఆ యజమానికి వేసిన బిల్లు ఎంతో తెలుసా? వందలు కాదు.. వేలు కాదు.. లక్షల్లో కూడా కాదు.. ఏకంగా కోట్లలో వేశారు.
 
ఇలాంటి విషయం తెలిస్తే.. ఎవరు మాత్రం షాక్‌కు గురి కాకుండా ఉంటారు. ఈ ఘటన జరిగింది ఎక్కడో వేరే దేశాల్లోనో, రాష్ట్రాల్లోనో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చింతలపూడిలో శ్రీ సాయి నాగమణి ఓ టిఫిన్‌ హోటల్‌ నడుపుతున్నారు. 
 
ఎప్పటిలాగే ఆగస్టు నెలకు సంబంధించిన కరెంట్‌ బిల్లు వచ్చింది. అయితే ఈసారి ట్రూఅప్‌ చార్జీలతో కలిపి వేశారు. అయితే, రూ.21,48,62,224 విద్యుత్‌ బిల్లు రావడంతో హోటల్‌ యజమాని అవాక్కయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయిల్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..