Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముగిసిన రవితేజ 6 గంటల విచారణ: మీడియా కంటపడకుండా..?

Advertiesment
ముగిసిన రవితేజ 6 గంటల విచారణ: మీడియా కంటపడకుండా..?
, గురువారం, 9 సెప్టెంబరు 2021 (17:30 IST)
టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో హీరో రవితేజ ఈడీ అధికారుల విచారణ ముగిసింది. డ్రగ్స్‌ కేసు మరియు మనీలాండరింగ్‌ వ్యవహారం లో ఈడీ అధికారులు హీరో రవి తేజ ను విచారణ చేశారు. హీరో రవి తేజ తో పాటు, అతని డ్రైవర్‌, కెల్విన్‌ స్నేహితుడు జిసాన్‌ ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. హీరో రవి తేజ ను దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు.
 
పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం హీరో రవి తేజ విచారణను ముగించారు. కాసేపటి క్రితమే డ్రగ్స్‌ కేసులో హీరో రవి తేజ ఈడీ అధికారుల విచారణ ముగిసింది. విచారణ ముగియగానే… మీడియా కంట పడకుండా… రవి తేజ తన కారులో ఎక్కి… మళ్లీ గెస్ట్‌ హౌజ్‌ కు వెళ్లారు.
 
కాగా.. ఇవాళ ఉదయం 10 గంటల సమయం లో ఈడీ విచారణ హాజరయ్యారు. ఇక, ఈడీ విచారణలో రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్‌ కూడా కీలకంగా మారాడు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ముందుగా పట్టుబడింది శ్రీనివాసే. అతడిని ఎక్సైజ్‌ ప్రత్యేక బృందం విచారించడంతో కెల్విన్‌ పేరు తెరపైకి వచ్చింది.. వీరి ఇద్దరినీ విచారించడంతో.. టాలీవుడ్‌ స్టార్స్ డ్రగ్స్‌ వినియోగం బయటపడింది. శ్రీనివాస్ ద్వారా నటీనటులకు డ్రగ్స్‌ సరఫరా అయినట్టు అధికారులు గుర్తించారు.
 
ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు హీరో రవితేజ.. 11 గంటలకు విచారణ ప్రారంభమైంది.. ఇక, రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఉదయం 9 గంటలకే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 5 గంటల పాటు విచారణ సాగింది. 
 
అయితే, ఈ విచారణ సమయంలో గతంలో ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసిన కెల్విన్‌ స్నేహితుడు జిషాన్‌ను ఈడీ కార్యాలయానికి రప్పించారు. ఈడీ విచారణలో రవితేజకు సంబంధించిన ఐదేళ్ల బ్యాంకు లావాదేవీలను పరిశీలించినట్టుగా తెలుస్తోంది. 
 
రవితేజ ఖాతాలతో పాటు డ్రైవర్‌ శ్రీనివాస్‌ బ్యాంక్‌ అకౌంట్ల నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇతర ఖాతాల్లోకి వెళ్లినట్టుగా గుర్తించారని చెబుతున్నారు. అయితే, బ్యాంకు లావాదేవీల చుట్టూ.. విచారణ జరిగినట్టుగా తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#Annaatthe డబుల్ ట్రీట్.. రజనీకాంత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్