Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోగులు- డాక్టర్ల నడుమ అంతరాలను పూరించేందుకు హీల్ఫా మొబైల్‌ హెల్త్‌కేర్‌ యాప్‌

రోగులు- డాక్టర్ల నడుమ అంతరాలను పూరించేందుకు హీల్ఫా మొబైల్‌ హెల్త్‌కేర్‌ యాప్‌
, గురువారం, 9 సెప్టెంబరు 2021 (19:42 IST)
హైదరాబాద్‌ కేంద్రంగా కలిగిన డిజిటల్‌ హెల్త్‌కేర్‌ స్టార్టప్‌, హీల్ఫా తమ యాప్‌ను ఆవిష్కరించింది. ప్రతి వ్యక్తి ఆరోగ్యం నిర్వహించుకునే అవకాశాన్ని ఈ యాప్‌ మెరుగుపరుస్తుంది. టెలి మెడిసన్‌, వ్యక్తిగత సంరక్షణ కోసం కనెక్ట్‌ చేయబడిన ఆరోగ్య సంరక్షణ నివారణ, నిర్వహణ, చికిత్సను అందించే సమగ్రమైన నిర్వహణ ఉపకరణంగా ఇది డాక్టర్లు మరియు రోగుల నడుమ నిలుస్తుంది. ఈ నూతన యాప్‌, రోగులకు తమ వైద్య స్థితి తెలుసుకోవడంతో పాటుగా సంబంధిత ఆరోగ్య సంరక్షణను వేగంగా, సమర్థవంతంగా పొందేందుకు సహాయపడటాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌ మరియు వెబ్‌ పోర్టల్‌ ద్వారా లభ్యమవుతుంది. ఐఓఎస్‌పై త్వరలోనే ఈ యాప్‌ విడుదల చేస్తారు.
 
‘‘ప్రస్తుత వాతావరణంలో, ఎంహెల్త్‌ మార్కెట్‌లో మేము వేగవంతమైన వృద్ధిని చూస్తున్నాము. హెల్త్‌కేర్‌ పరిశ్రమ స్థిరంగా ఆవిష్కరణలను జరుపుకుంటుంది. ఈ మారిన వాతావరణంలో  రోగులు మరియు డాక్టర్ల నడుమ అంతరాలను పూరించాలని కోరుకుంటున్నాము. సౌకర్యవంతమైన పరిష్కారాలను అందించాలనే లక్ష్యంతో విడుదల చేసిన ఈ నూతన యాప్‌ మెరుగైన ఫలితాలను పొందడంలో రోగులకు సహాయపడగలదని నమ్ముతున్నాం’’ అని రాజ్‌ జనపరెడ్డి, ఫౌండర్‌ అండ్‌ సీఎస్‌ఓ, హీల్ఫా అన్నారు.
 
హీల్ఫా పై రోగికి సంబంధించిన ఆరోగ్య రికార్డులన్నీ ఒక్క క్లిక్‌లో డాక్టర్‌తో పాటుగా రోగికి సైతం లభ్యమవుతాయి. అంతేకాదు డిజిటల్‌ చెల్లింపులనుసైతం ఇది అనుమతిస్తుంది. అదనంగా టెలి కన్సల్టేషన్‌తో రోగులు ఏ సమయంలో అయినా, ఎక్కడ నుంచైనా డాక్టర్లను సంప్రదించవచ్చు. హీల్ఫా యొక్క ఐఓటీ కనెక్టడ్‌ ఉపకరణాలు ఆటోమేటిక్‌గా రోగి వైటల్స్‌ను క్యాప్చర్‌ చేయడంతో పాటుగా సంరక్షణ నాణ్యతను సైతం వృద్ధి చేస్తాయి. ఈ యాప్‌తో మొత్తం కుటుం ఆరోగ్యంను నిర్వహించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దగ్గులు - హరించుటకు సులభ యోగాలు