Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దగ్గులు - హరించుటకు సులభ యోగాలు

దగ్గులు - హరించుటకు సులభ యోగాలు
, గురువారం, 9 సెప్టెంబరు 2021 (06:30 IST)
* దానిమ్మ కాయ పెచ్చులను వేయించి చూర్ణం చేసుకుని పూటకు 5 గ్రాముల చూర్ణం తేనెతో తీసుకొనుచున్న కోరింత దగ్గు తగ్గిపోవును. 
 
 * శుద్ధిచేసిన కొబ్బరి నూనె పూటకు 10ml చొప్పున తీసుకొనుచున్న కోరింత దగ్గు తగ్గిపోవును. 
 
 * మర్రిచెట్టు పైన బెరడు తెచ్చి నీడన అరబెట్టి చూర్ణం చేసి ఆ చూర్ణం 20 గ్రాములు పావు లీటర్ నీటిలో వేసి కాచి వడపోసుకొని అందులో పాలు మరియు పంచదార కలుపుకుని తాగుచుండిన యెడల 3 నుంచి 5 దినములలో దగ్గు తగ్గిపోవును.
 
 * పిప్పిలి గింజను ఆముదపు దీపమున కాల్చి తమలపాకు కు కొంచం తేనె రాసి ఆ తమలపాకులో ఈ కాల్చిన పిప్పిలి గింజని పెట్టి నమిలి మింగుచున్న యెడల దగ్గులు నయం అగును.
 
 * తులసి పువ్వులను అల్లపు రసంతో మర్దించి శనగల వలే మాత్రలను చేయవలెను పూటకి ఒక మాత్ర చొప్పున మంచినీటితో సేవించిన దగ్గులు తగ్గిపోవును. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నపిల్లలు ఏం తినాలి? ఎంత తినాలి? ఎలా తినాలి?