Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్నపిల్లలు ఏం తినాలి? ఎంత తినాలి? ఎలా తినాలి?

చిన్నపిల్లలు ఏం తినాలి? ఎంత తినాలి? ఎలా తినాలి?
, గురువారం, 9 సెప్టెంబరు 2021 (06:00 IST)
కనీసం ఆరు నెలలు తల్లి పాలు ఇవ్వాలి. ఆ తరవాత మీ ఇష్టం. ఒకవేళ తల్లి పాలు ఇవ్వటం ఏ కారణం వల్లనైనా వీలు కాకపోతే, పెద్ద తప్పు చేస్తున్నామని అనుకోనక్కర లేదు. వేరే పాలు కూడా వాడవచ్చును. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంత ఇబ్బంది ఉండదు. ఖర్చు భరించగలిగితే మామూలు పాలకన్నా డబ్బా పాలు (infant formula) మెరుగు. పిల్లల డాక్టర్లు మీకు సరైన సూచనలు ఇవ్వగలరు.
 
ఐదారు నెలల తరవాత మనం తినేవన్నీ పిల్లలకు పెట్టుకోవచ్చును. దంతాలు లేకపోయినా చిగుళ్లతో నమిలేస్తారు. ఏదైనా నమలలేకపోతే మానెయ్యవచ్చును. ప్రత్యేకించి వంటలు ఏమీ చెయ్యనక్కర లేదు. పిల్లలు, పెద్దవాళ్ళు, కలసి తినాలి. పిల్లలు తమ చేతులతో తాము తింటారు. దానిని మనం ప్రోత్సహించాలి. మన చేతులతో తినిపించడం చాలా తక్కువగా ఉండాలి. అంటే పిల్లలను గౌరవించాలి.
 
మార్కెట్లో దొరికే పిల్లల తిళ్ళు ఏవైనా సరే, అవి పిల్లలకు మేలు చేయవని పరిశోధనల్లో చాలా సార్లు తేలిపోయింది. మనం తినేది పిల్లలకు పెట్టుకుంటున్నాము కాబట్టి, ముందు మనం మంచి ఆహారం తినాలి. ఒకవేళ మనం ఏదయినా అనారోగ్యమైనది తిన దలచుకుంటే, ఆ పని చాటుగా చెయ్యాలి.

ఎందుకంటే మన ఆరోగ్యం కన్నా పిల్లల ఆరోగ్యం ముఖ్యం. పిల్లలు సరైన అలవాట్లు చేసుకుంటున్న మైనపు బొమ్మలు. మనం అలవాట్లు ఏర్పడిపోయిన కాంక్రీటు విగ్రహాలం. రుచులు చిన్న వయసులోనే ఏర్పడతాయి. ఉదాహరణకి చిన్నప్పుడు ఉప్పు, తీపి ఎక్కువ తిన్నవారు, పెద్దయిన తరవాత అవి లేకుండా ఉండలేరు.
 
మంచి ఆహారం పిల్లలకైనా పెద్దవారికైనా ఒక్కటే. సాధ్యమైనంత ప్రకృతి సిద్ధంగా ఉండాలి. వీలైనంత వైవిధ్యం ఉండాలి. కెలోరీలు, ప్రోటీన్లు, విటమిన్లు, నిష్పత్తులు, లెక్క వేసుకోనక్కర లేదు. స్థానికంగా, చౌకగా దొరికే వాటిని వదులుకోగూడదు. ఉదాహరణకి పచ్చి కొబ్బరి, వేరుశనగ, కాయలు, పండ్లు.
 
పిల్లలకి వారి ఆకలిని బట్టి పెద్దవారికన్నా ఎక్కువ సార్లు తినవలసిన అవసరం ఉండవచ్చును. మనం కేవలం ఆకలికే తినం. దుఃఖమొస్తే తింటాం. సంతోషమొస్తే తింటాం. నీరసంగా ఉంటే తింటాం. బోరు గొడితే తింటాం. ఇది ఒక వ్యసనం లాంటిది. దీనికి బీజాలు పసితనంలోనే పడతాయి. ముందు నుండీ జాగ్రత్త పడాలి. పిల్లలను ఊరుకోబెట్టటానికి తిండిని సాధనంగా వాడకూడదు.
 
పిల్లలకు తిండి పెట్టుకోవటం అప్రయత్నంగా, ఆహ్లాదంగా ఉండాలి. కష్టంగా అనిపించగూడదు. కష్టంగా ఉందంటే మీరు సరైన మార్గంలో లేరని అర్ధం.
 
5-15 పిల్లలుకు
 
- సింపుల్ గా చెప్పాలి అంటే రోజు మొత్తం లో ఒక గుడ్డు, ఒక గ్లాస్ పాలు (200ml) ఏదో ఒక ఫ్రూట్ కనీసం ఒక అరటి పండు కచ్చితంగా గా ఉండాలి
 
- రోజుకీ కనీసం మంచి నెయ్యి 2 స్పూన్స్ ఇవ్వండి (అవి జీవ రసయనాలు )
 
- పెరుగు తినడం నేర్పించండి ( అందులో ప్రోబయోటిక్స్ ఉంటాయి అంటే మంచి బ్యాకి్టీరియా చాలా మేలు చేయిస్తాయి
 
- వేరుశెనగ, నువ్వులు, కొబ్బరి, మినుములు, వీటిని బెల్లం తో కలిపి ఉండలుగా చేసి పెట్టండి దీని వల్ల, ప్రోటీన్స్, ఐరన్, కాల్షియమ్ బాగా అందుతాయి
 
- మైదా, పంచదార, కూల్డ్రింక్స్, కీ దూరం గా ఉంచండి వీటివల్ల ఫిట్ కు బదులు ఫ్యాట్ గా అవుతారు పిల్లలు
 
- మట్టిలో పిల్లల్ని ఆడుకొనివండి, వ్యాయామం చేయడం అలవాటు చేయండి,సెల్ ఫోన్ కు పిల్లలు దూరం ఉండడానికి ట్రై చేయండి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రిపూట నిద్ర చెడగొట్టేవి అవే...