Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం

Advertiesment
Food
కరోనా కాలంలో రోగనిరోధక శక్తి అత్యంత ప్రధానమైన అంశం. పెద్దలకు ఓకే కానీ..పిల్లల విషయంలో మాత్రం రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. పైగా పిల్లలకు సులభంగా ఫ్లూ, దగ్గు, ఫీవర్ వస్తుంటుంది. అందుకే వారి ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆహారంలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోండి.
 
1.క్యారెట్లు..
పిల్లల పెరుదలకు, ఆరోగ్యానికి విటమిన్ ఎ, జింక్ చాలా ముఖ్యం. అందుకే వారి ఆహారంలో క్యారెట్లు ఉండేలా చూసుకోండి. క్యారెట్‌తో  కంటిచూపు మెరుగు అవుతుంది. దాంతో వారి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
 
2. పెరుగు
పిల్లల శరీరంలో ఉండే బ్యాక్టీరియా నశించాలి అంటే వారికి పెరుగు తప్పకుండా తినిపించాలి. పెరుగు తినడం వల్ల అందులో ఉండే కాల్షియం వల్ల ఎముకలు గట్టిగా మారుతాయి. 
 
3. బత్తాయి, నిమ్మకాయ..
నారింజ, బత్తాయి వంటి నిమ్మజాతి పండ్లు తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సీ వల్ల ఫ్లూ, జలుబు, ఫీవర్ తగ్గుతుంది.
 
4. బాదం, పిస్తా
బాదం, పిస్తా, జీడిపప్పు తినడం వల్ల అందులో ఉండే పోషకాల వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. పిల్లలు బలంగా మారుతారు. ఆరోగ్యంగా మారుతారు.   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉల్లిపాయ ముక్కను పాదంపై రాత్రంతా ఉంచి చూడండి.. ఏమవుతుందో?!