పాఠశాలలు తెరిచారు. ఐతే స్కూళ్లకి పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. అలా జంకుతూనే పిల్లలని బడులకు పంపుతున్నారు. అసలే చిన్నపిల్లలకి ఇంకా వ్యాక్సిన్ వేయలేదు. పైగా థర్డ్ వేవ్ అంటూ వార్తలు. అదేమోగానీ స్కూలు వెళ్లిన పిల్లలకి కరోనావైరస్ సోకిందనే వార్త ఇప్పుడు ఆందోళనకి గురి చేస్తోంది.
విజయనగరం జిల్లా బొబ్బిలి పరిధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 4వ తరగతి విద్యార్థుల్లో 10 మందికి కరోనా సోకినట్లు ఎంఈవో తెలిపారు. పాఠశాలలో 160 మంది విద్యార్థులు, ఏడుగురు ఉపాధ్యాయులు వున్నారు.
కోవిడ్ బారిన పడిన విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు మధ్యాహ్న భోజన సిబ్బందికి కోవిడ్ పరీక్షలు చేయించనున్నట్లు తెలిపారు. వారం రోజుల పాటు పాఠశాలకు సెలవు ప్రకటించాలని మునిసిపల్ కమిషనర్‌ను కోరినట్లు చెప్పారు.