Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్నం పరబ్రహ్మం.. ఎందుకంటారో తెలుసా?

అన్నం పరబ్రహ్మం.. ఎందుకంటారో తెలుసా?
, శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:23 IST)
మన మనుగడకు ఎంతో అవసరమయిన శక్తి అధికశాతం మనకు అన్నం ద్వారానే లభిస్తున్నది. ఆసియా ఖండంలో శాతం ప్రజలకు ముఖ్య ఆహారం వరి అన్నం. ఉత్తర హిందూస్థానంలో గోధుమ ఉపయోగించినట్లుగా దక్షిణభారతంలో బియ్యం ఎక్కువగా వాడతారు. వారిలో గానే ఎన్నో రకాలు ఉన్నా, అధిక దిగుబడికి చాలా రకాల సంకరజాతులను గంధర్మాల, పోషకాల పెంపుదలతో అభివృద్ధిపరుస్తున్నారు.
 
మనం వినియోగిస్తున్న బియ్యం సాధారణంగా బాగా పాలిష్ పెట్టినదే అయివుంటుంది. అంటే సూక్ష్మస్థాయిలో ఉండే అతివిలువయిన పొర పకించి కేవలం పిండిపదార్థం మాత్రమే మిగులుతుంది. అందువలన ఆరోగ్యరీత్యా పాలిష్ చేయని బియ్యాన్నే ఆహారంగా ఉపయోగించడం శ్రేయస్కరం. ఆస్ట్రేలియా, అమెరికా వంటి విదేశాలలో సహజంగా దొరికే అడవిబియ్యం ఎంతఖరీదయినా ని వినియోగించి లబ్దిపొందుతున్నారు.
 
బియ్యానికి అంటుకుని ఉండే తవుడు పొరను సాధ్యమయినంతవరకు తొలగించకుండా ఉండడం మంచిది. అది ఎంతో విలువయిన పోషకాల గని. బాగా పాలిష్ చేసిన బియ్యం తినడం ఆధునికకాలంలో ఫ్యాషన్ అయినందువలన సరాల బలహీనత, రక్తహీనత, బెరిబెరి, అజీర్ణం, గ్యాస్ వంటి అనారోగ్యాలు ఎక్కువయిపోయాయి. ఈ విషయం అర్థం చేసుకొని అన్నం వండే బియ్యాన్ని ఎన్నుకుంటాం..
 
వరి అన్నం ప్రధానగుణం :
పరిధాన్యం నుండి వచ్చే బియ్యం దంచినవి లేదా పట్టుతో ఆడించినవి, పాలిష్ చేయనివి మాత్రమే సకల గుణ ది. వీటిని బాగా కడిగి చక్కగా ఉడికించింది మాత్రమే మనకు అన్నం అని మనం గ్రహించాలి. ఇటువంటి అన్నం రెండు పూటలామనిషికి ఆయురవృద్ది, వీర్యపుష్టి, బలం లభించి శరీరం కాంతిమంత కుండలిక శ్రమ తొలిగిపోతాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

గాయాలు, పచ్చిబియ్యం కంటే ఉడికించిన అన్నంలో పోషకాల విలువ పెరిగి, అందులోని పదార్ధం సులభంగా జీర్ణమయే స్థాయికి మారుతుంది. డాక్టర్లు జ్వరపడి చిన వారికి బియ్యపు జావ, ఇడ్లీలను ఇవ్వమనడం మనకు తెలిసిన విషయమే. వేయించిన బియ్యపుజావ చాలా తేలికగా జీర్ణమై శరీరానికి హితవు చేస్తుంది. పాత బియ్యంలో పిండి పదార్థం తేలికగా జీర్ణమయ్యే స్థితిలో వుంటుంది.
 
కొత్త బియ్యం కన్నా, బియ్యం పాతపడుతున్న కొద్దీ దానిలోని దుర్గుణాలు హరించి పోతాయి. అందుకని బియ్యం కనీసం 6 నెలలు పాతవిగా చూసి కొనడం శ్రేయస్కరం. పాత బియ్యం కడుగుతో 'లక్ష్మీచారు కూడా చేస్తారు. ఇందులో 'బి' విటమిన్లు అత్యధిక స్థాయిలో వుంటాయి.
 
అన్నం వండి వార్చడం కంటే, అత్తెసరు పెట్టి నీరు ఇగిరిపోయేలా చేయడం మంచిది. ఒకవేళ వార్చితే, ఆ వార్చిన గంజిని పారవేయకుండా త్రాగడం, అన్నంతో కలిపి తినడం కూడా మంచిదే. పల్లెల్లో బియ్యం కడిగిన నీటిని, మిగిలిపోయిన గంజి, అన్నాలను పశువులకు పెట్టడం చూస్తుంటాం. వాటి పోషకాలు, వృథాపోకుండా మనిషికి, పశువులకు కూడా వినియోగించడం. మన సంప్రదాయరహస్యం.
 
అన్నంలో మజ్జిగ లేదా పెరుగు కలిపి వాడితే ఎంతో మంచిది. శరీరంలో అతి ఉష్ణాన్ని ఇది నివారిస్తుంది. అన్నంలో పాలు కలిపి కొంచెం మజ్జిగతో ముందురాత్రి తోడుపెట్టిన అన్నాన్ని తోడంటు అన్నం అంటారు. అందులో ఒకటి రెండు ఉల్లిపాయలు తిరిగి చేర్చితే, దాని చలువచేసే గుణం మరింత ఇనుమడిస్తుంది. మరునాటి ఉదయం దీన్ని బ్రేక్ఫాస్ట్ ఇస్తే, ఎండకాలంలో పరీక్షలకు తయారవుతూ చదువులతో తలమునకలవుతున్న పిల్లలకు ఇది అమృతంగా పనిచేసి, వారికి కావలసిన పోషణను అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశానికి మరో 43 లక్షల మంది నర్సుల అవసరం ఉంది