ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్ భారత్‌లో మూతపడనుంది. కంపెనీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్‌లో సంస్థకున్న రెండు ఉత్పత్తి ప్లాంట్లను మూసివేయాలని.. భవిష్యత్తులో భారత ఆటో మార్కెట్లో తన కార్లను దిగుమతి చేసుకుని విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం.
దేశంలో చెన్నై, గుజరాత్ వంటి ప్రాంతాల్లో కార్యకలాపాలను నిర్వహించిన ఫోర్డ్.. రూ.15వేల కోట్ల నష్టంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాహనాల అమ్మకాల తగ్గడంతో భారత్‌లో తయారీని ఆపేస్తున్నట్లు నిర్ణయించుకుంది. తద్వారా దేశీయంగా ఈ సంస్థల్లో పనిచేస్తున్న 4వేల మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడింది.