Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోనిలో నిమ్మకాయ రసం పిండితే గర్భం రాదా?

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (16:58 IST)
చాలా మంది యువతీయువకులు పెళ్ళికాకముందే శృంగారంలో పాల్గొంటుంటారు. కొందరు తగిన జాగ్రత్తలు తీసుకుని శారీరకంగా కలుస్తుంటారు. మరికొందరు మాత్రం తొందరపడి సంభోగంలో పాల్గొంటారు. ఇలాంటి యువతుల్లో కొందరికి అవాంఛిత గర్భాలు వస్తుంటాయి. అయితే, శారీరకంగా కలిసిన తర్వాత నిమ్మకాయ రసాన్ని యోనిలో పూసుకుంటే గర్భం రాదన్నది కొందరి మూఢనమ్మకం. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఓసారి తెలుసుకుందాం. 
 
సాధారణంగా గర్భంరాకుండా ఉండేందుకు సెక్స్ సమయంలో కండోమ్ వాడటమే అత్యంత సురక్షితమని అంటున్నారు. సంభోగం తర్వాత యోనిలోకి నిమ్మకాయ రసం పిండితే గర్భం రాకుండా ఉంటుందనేది కేవలం అపోహేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పైగా ఇలాంటి చర్య చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. 
 
నిమ్మకాయ రసం వల్ల ఆ భాగంలో ఇన్​ఫ్లమేషన్​ కలిగి పుండ్లు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. అది కాస్త గర్భాశయానికి చేరితే మరింత ప్రమాదమన్నారు. గర్భం రాకుండా ఉండాలంటే కండోమ్​ వాడాలే తప్ప ఇటువంటి పద్ధతులు అనుసరించకూడదని చెప్పుకొచ్చారు.
 
స్త్రీపురుషుల కలయిక తర్వాత యోనిలో జిల్లేడు పాలు పోయడం, నిమ్మకాయ రసం పిండటం, సున్నపు నీళ్లు పోయడం, సబ్బునీళ్లు పోయడం ఇటువంటివి అన్నీ మొరటు పద్ధతులని.. పూర్తి అశాస్త్రీయమని, ఇలాంటి చర్యల వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం