Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Akshaye Khanna: ప్రశాంత్ వర్మ.. మహాకాళి నుంచి శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్

Advertiesment
Akshaye Khanna as a Sukracharya  first look

చిత్రాసేన్

, మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (16:56 IST)
Akshaye Khanna as a Sukracharya first look
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో తొలి చిత్రం హనుమాన్ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది.  ఈ యూనివర్స్ లో నెక్స్ట్ ఇంస్టాల్మెంట్ మహాకాళి. దీనిని RKD స్టూడియోస్‌ బ్యానర్ పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మించారు. RK దుగ్గల్ సమర్పిస్తున్నారు. ప్రశాంత్ వర్మ క్రియేటర్, షోరన్నర్‌గా వ్యవహరిస్తుండగా, పూజ అపర్ణ కొల్లూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
 
బ్లాక్‌బస్టర్ ఛావాలో ఔరంగజేబు పాత్రను అద్భుతంగా పోషించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా మహాకాళిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది ఆయనకి తెలుగులో తొలి చిత్రం.  ఛావా విజయం తర్వాత ఆఫర్లు వెల్లువెత్తినప్పటికీ, కథ బలం, అతని పాత్ర డెప్త్ ద్వారా అక్షయ్ తన తెలుగు రిలీజ్ కోసం మహాకాళిని ఎంచుకున్నారు.
 
అక్షయ్ పాత్రను పరిచయం చేస్తూ, సినిమాలోని అతని ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హిందూ పురాణాలలో అసురుల గురువు శుక్రాచార్యుడు గా ఒక భారీ పర్వత కోట ముందు నిలబడి ఉన్నట్లు ప్రజెంట్ చేసిన లుక్ అదిరిపోయింది.
 
తపోవ్రత వస్త్రాలు, చీకటినీ చీల్చే కాంతివంతమైన కళ్ళతో శుక్రాచార్యుడి రూపం అద్భుతంగా దర్శనమిస్తుంది. దేవతలూ – దానవులూ ఇద్దరి భవితవ్యాన్ని మలిచిన మహర్షిగా, ఆయనను చిత్రంలో అద్భుతమైన పాత్ర చూపించబోతున్నారు. శుక్రాచార్యుడు కేవలం ఋషి మాత్రమే కాదు, జ్ఞానం, విరోధం, విశ్వాధికారానికి ప్రతీకగా సజీవ చిహ్నంగా చూపించారు.
 
సనాతన విద్యకు ఆచార్యుడు, మరణించిన వారిని బతికించగల మృత-సంజీవని మంత్రం రహస్యం తెలిసిన శుక్రాచార్యుడు అసురుల ఆధ్యాత్మిక మార్గదర్శకుడు మాత్రమే కాదు, అపారమైన వ్యూహకర్త.
 
ఈ చిత్రానికి సంగీతాన్ని స్మరణ్ సాయి అందించగా, సినిమాటోగ్రఫీని సురేష్ రగుతు నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి వ్యవహరిస్తున్నారు.
 
మహాకాళి చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే 50 శాతం షూట్ పూర్తి కాగా, డిసెంబర్ నాటికి మొత్తం ప్రొడక్షన్ పూర్తి చేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్‌ కొనసాగుతున్నాయి. విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేస్తారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతిపెద్ద పైరసీ రాకెట్‌ను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు