Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

Advertiesment
Director Arjun Jandhyala

డీవీ

, శనివారం, 16 నవంబరు 2024 (16:57 IST)
Director Arjun Jandhyala
సాయి మాధవ్ అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ఎమోషనల్ డెప్త్ పట్టుకుని కథకి తగ్గట్టుగా మాటలందించారు. భీమ్స్ ఈ సినిమాకి తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ప్రాణప్రతిష్ట చేశాడు. మ్యూజికల్ గా సినిమా వండర్ఫుల్ గా ఉంటుంది అని దేవకి నందన వాసుదేవ డైరెక్టర్ అర్జున్ జంధ్యాల తెలిపారు.
 
అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ అందించారు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నవంబర్ 22 ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అర్జున్ జంధ్యాల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.  
 
‘దేవకి నందన వాసుదేవ’ ట్రైలర్ లో కంసుడు, కృష్ణుడు రిఫరెన్స్ కనిపించింది ? ఆ కథ స్ఫూర్తి ఉందా ?
-ఆ రిఫరెన్స్ ఇందులో ఉంటుంది. మూడో సంతానం వలన మరణం అని ట్రైలర్ లోనే చాలా క్లియర్ గా చెప్పాము. అయితే చెప్పని విశేషాలు చాలా ఉన్నాయి. ట్రైలర్లో కంటే చాలా ఎక్కువ కథ సినిమాలో ఉంది.
 
ఈమధ్య డివోషనల్ కంటెంట్ ఉన్న సినిమాలు విజయం సాధిస్తున్నాయి కదా.. ఆ తరహాలో ఈ కథ చేశారా?
- అలా ఏం లేదండి. హనుమాన్ సినిమా రాకముందే ఈ కథని లాక్ చేసుకున్నాం. నేను, నిర్మాత కలిసి ఒక సినిమా చేయాలనుకున్నాము. అలాగే నిర్మాత గారికి ప్రశాంత్ గారికి ఒక కమిట్మెంట్ ఉంది. అశోక్ గల్లా గారికి అంతకుముందు ఒక కథ చెప్పాను. అ వర్క్ జరుగుతున్నా సమయంలో ప్రశాంత్ గారు ఈ కథ చెప్పారు. ఇది అశోక్ కి నచ్చింది. మా అందరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. ప్రశాంత్ గారికి నేను తీసిన గుణ సినిమా ఇష్టం. ఈ కథకు నేనైతే ఓకే అని ఆయన భావించారు. అలా ఈ ప్రాజెక్టుని చేయడం జరిగింది.
 
ప్రశాంత్ గారు చెప్పిన కథకి మీరు ఎలాంటి మార్పులు చేసుకున్నారు?
-దర్శకుడిగా కథని ఓన్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు కొన్ని ఐడియాస్ వస్తాయి. కథని ఇంకా అద్భుతంగా చెప్పాలనిపిస్తుంది.  నేను చెప్పిన కొన్ని ఆలోచనలకి ప్రశాంత్ గారు హ్యాపీగా ఫీలయ్యారు. ఆయన సినిమా చూసి చాలా సర్ ప్రైజ్ ఫీల్ అయ్యారు.
 
అశోక్  ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. లుక్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు ?
-ఈ కథకు, ఆయన క్యారెక్టర్ కి ఎలాంటి లుక్ అయితే బాగుంటుందని దానిపై చాలా వర్క్ చేసాం. ప్రతిదీ ఆ క్యారెక్టర్ నుంచి డిజైన్ చేసుకున్నాం. అశోక్ గారు యాక్షన్ ఎమోషన్ లో ఇరగదీస్తారు. ఈ సినిమాని చాలా అద్భుతంగా చేశారు. తన పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు.
 
ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది మురారితో కనెక్ట్ అవుతున్నారు?
- మురారిలో ఒక డెస్టినీ ఫీల్ వుంటుంది. ఇందులో అది ఇంకోరకంగా ఉంటుంది. హీరోకి ఒక గండం ఉంది. ఆ గండం నుంచి ఎలా బయటపడతారనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ట్రైలర్ లో కూడా ఎక్కడా లేనివిధంగా భూమిలో సుదర్శన చక్రంతో వాసుదేవుని విగ్రహం అని చెప్పాం. దానికి ఒక కనెక్షన్ ఉంది. అది చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఒక సెపరేట్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. అది కచ్చితంగా చెప్పగలను.
 
మహేష్ బాబు గారికి సినిమా చూపించబోతున్నారా?
-మహేష్ బాబు గారికి ట్రైలర్ చాలా నచ్చింది. ఆయన టీమ్ అందర్నీ అప్రిషియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే సినిమాను కూడా చూడబోతున్నారు. ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్లంతా కూడా చాలా అద్భుతంగా ఉందని అప్రిషియేట్ చేశారు.  
 
డివోషనల్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ని ఎలా బ్లెండ్ చేశారు?
-ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి అద్భుతంగా నచ్చుతుంది. ఇది మంచి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్. ధర్మం అంటే దేవుడు అనే మాట కూడా ఇందులో చాలా కీలకం.  దాని యొక్క సారాంశం కథలో అండర్లైన్ గా వెళుతుంది. అలాగే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. చాలా మంచి విజువల్ ఫీలింగ్ ఉంటుంది.
 
ఈ సినిమాకి విజయనగరం బ్యాక్ డ్రాప్ తీసుకొని కారణం?
ఈ కథకి అలాంటి టెంపుల్, ఆ లొకేషన్ అయితే యాప్ట్ గా ఉంటుందని అనిపించింది. ఆడియన్స్ కి చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.  
 
కొత్తగా చేస్తున్న ప్రొజెక్ట్స్ గురించి?
-ఒక కథ సిద్ధంగా వుంది. ‘దేవకి నందన వాసుదేవ’ రిలీజ్ తర్వాత దీనిపై ద్రుష్టి పెడతాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సామాన్యులే సెలబ్రిటీలుగా డ్రింకర్ సాయి టీజర్ లాంఛ్