Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గమ్మత్తయిన గాత్రం కోసం రమణ గోగులను రంగంలోకి దింపిన అనిల్ రావిపూడి

Advertiesment
Bhaskarabhatla, BheemsCeciroleo, Anil Ravipudi

డీవీ

, బుధవారం, 13 నవంబరు 2024 (19:00 IST)
Bhaskarabhatla, BheemsCeciroleo, Anil Ravipudi
వెంకటేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా సంక్రాంతికివస్తున్నాం. అనిల్ రావిపూడి దర్శకుడు. ఎఫ్ 3కు సీక్వెల్ గా ఈ సినిమా వుండబోతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్ జరిగాయి. దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
గోదారిగట్టున రామచిలుకవే, గోరింటాకుపెట్టుకున్న చందమామవే.. అంటూ గీతరచయిత భాస్కరభట్ల రాసిన గీతానికి తగిన ట్యూన్ ను సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఇచ్చాడు. దానితో బాగా ఇంప్రెస్ అయిన దర్శకుడు అనిల్ రావిపూడి ట్యూన్ అదిరిపోయింది. మరి పవర్ ఫుల్ గా పాట వుండాలంటే పెక్యులర్ గాయకుడు కావాలని అడుగుతాడు. దాంతో పవన్ కళ్యాణ్ సినిమాల్లో పాడిన ఆ తర్వాత వెంకటేస్ సినిమాకు 18 ఏళ్ళనాడు పాడిన రమణ గోగుల పేరు బయటకు వస్తుంది. దాంతో ఆయన్నే ఫిక్స్ చేయడం అనిల్ రావిపూడి అనడంతో సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఫోన్ చేసి రమణ గోగులను రప్పిస్తాడు. నేడు ఈ పాటను ఆయన పాడారు. 
 
స్టూడియో జరిగిన చిట్ చాట్ వీడియోను అనిల్ రావిపూడి విడుదల చేశారు. 18 సంవత్సరాల తర్వాత భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన చార్ట్‌బస్టర్ ట్యూన్ కోసం విక్టరీ వెంకటేష్, రమణగోగుల బ్లాక్‌బస్టర్ పాతకాలపు కాంబోని తిరిగి తీసుకువస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకోసం చేసిన ఈ పాటను త్వరలో విడుదలచేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. 2025 సంక్రాంతికివస్తున్నాం అంటూ మరోసారి డేట్ ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. శ్రీలీల ఫీజెంత.. రష్మిక మందన్న ఎంత తీసుకుంది?