యూనిక్, లార్జర్-దాన్-లైఫ్ ఎంటర్‌టైనర్‌లతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ, లార్జర్-దాన్-లైఫ్ సూపర్ హీరో సినిమా కోసం ఆర్.కె.డి స్టూడియోస్‌తో కలిసి పనిచేయబోతున్నారు. టాలీవుడ్‌లో తొలి జాంబీ జానర్ ఫిల్మ్‌తో అలరించిన ఆయన, తర్వాత ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్‌తో సంచలనాన్ని సృష్టించారు. అదే డ్రీంని మరో మెట్టు పైకి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా వస్తోంది అధీర.
ఈ సినిమాలో కళ్యాణ్ దాసరి హీరోగా గ్రాండ్ డెబ్యూ చేస్తుండగా, కీలక పాత్రలో ఎస్జే సూర్య కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను రివాజ్ రమేష్ దుగ్గల్ నేతృత్వంలోని ఆర్కేడీ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ) లో భాగంగా వస్తున్న ఈ చిత్రం, భారతీయ ఇతిహాసాల స్ఫూర్తితో, గ్రేట్ విజువల్స్‌తో రూపొందుతుంది. ప్రతి కథా వైవిధ్యంగా, ఒకే యూనివర్స్‌లో బ్లెండ్ అయ్యేలా ప్రశాంత్ వర్మ తన సూపర్ హీరో డ్రీమ్ యూనివర్స్‌కు బలమైన పునాది వేస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలో మేకర్స్ ఎస్. జే. సూర్య ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
బ్యాక్‌డ్రాప్‌లో ఒక అగ్నిపర్వతం పేలుడు, మంటలు, లావా, బూడిద ఆకాశాన్ని కప్పేస్తాయి. ఆ కల్లోలంలోనుంచి ఎస్. జే. సూర్య బుల్ లాంటి కొమ్ములతో, ట్రైబల్ దుస్తుల్లో, క్రూరమైన రాక్షసుడిలా కనిపిస్తున్నారు. తని ముందే కళ్యాణ్ దాసరి మోకాళ్లపై కూర్చుని ధైర్యంతో పైకి చూస్తూ మోడరన్ వార్ అవతార్ లో ట్రూ సూపర్ హీరోలా కనిపించారు. అధీర పోస్టర్ ఒక మహా సంగ్రామానికి నాంది పలికింది
ఇది ఆశ వర్సెస్ అంధకారం మధ్య యుద్ధం. ధర్మాన్ని రక్షించడానికి కళ్యాణ్ దాసరి తన సూపర్ పవర్స్‌ని ఉపయోగిస్తారు. అద్భుతమైన యాక్షన్, స్టంట్స్, గ్రేట్ విజువల్స్, హై వోల్టేజ్ డ్రామాతో ఈ సినిమా థియేటర్స్ లో థండర్‌క్లాప్ ఎక్స్‌పీరియెన్స్ అందించబోతోంది.
ప్రశాంత వర్మ హనుమాన్ సినిమాకు పని చేసిన శివేంద్ర ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్. మిగిలిన నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలు త్వరలో అనౌన్స్ చేస్తారు.
తారాగణం: కళ్యాణ్ దాసరి, ఎస్‌జే సూర్య
సాంకేతిక సిబ్బంది:
క్రియేటెడ్ బై: ప్రశాంత్ వర్మ
బ్యానర్: RKD స్టూడియోస్
సమర్పణ: ఆర్కే దుగ్గల్
నిర్మాత: రివాజ్ రమేష్ దుగ్గల్
దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
మ్యూజిక్: శ్రీ చరణ్ పాకాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి
డీవోపీ: శివేంద్ర
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి
పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచెర్ల
పీఆర్వో: వంశీ-శేఖర్
సోషల్ మీడియా అండ్ పీఆర్: MATH, Haashtag Media