Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జై హనుమాన్ కోసం హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి

Advertiesment
Rishab Shetty

సెల్వి

, శనివారం, 19 అక్టోబరు 2024 (14:17 IST)
కల్కి 2898 AD తర్వాత టాలీవుడ్, బాలీవుడ్‌కు 3D ఫార్మాట్‌ను మళ్లీ పరిచయం చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్' కూడా ఈ ఫార్మాట్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 
 
"ప్రీ-ప్రొడక్షన్ వర్క్ అంతా చేస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఇది చాలా ఛాలెంజింగ్ వర్క్ అవుతుంది. 3డి ఫార్మాట్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. 
 
ఇక రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రను పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకా అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి వుంది. 'హనుమాన్' ప్రపంచ వ్యాప్తంగా ఘనవిజయం సాధించిన తర్వాత ప్రశాంత్ వర్మ స్టాక్స్ పెరిగాయి. 
 
దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు హనుమాన్ సినిమా విజయంతో ఒక్కసారిగా మారుమోగింది. అతను తదుపరి సినిమా కూడా 'హనుమాన్' సినిమాకి సీక్వెల్‌గా 'జై హనుమాన్' తీస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఇప్పటికే బాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు టాక్ వినిపించింది. మరోవైపు చిరంజీవి, రామ్‌చరణ్, రానా దగ్గుబాటి‌లలో ఎవరైనా ఒకరు హనుమంతుడి క్యారెక్టర్ చేయనున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
 
దైవభక్తి మెండుగా ఉండే ఈ హీరో రిషబ్ శెట్టి ప్రశాంత్ 'జై హనుమాన్' స్టోరీ నేరేట్ చేసినట్లు సమాచారం. కథ నచ్చిన రిషబ్ హనుమాన్ రోల్ చేయడానికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీంతో ఈ క్రేజీ కాంబోపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుటుంబ సమేతంగా చూడదగ్గ వెబ్ సిరీస్.. ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’