బాలీవుడ్ నటి డింపుల్ హయాతి మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. తన ఇంట్లో పెంపుడు శునకాలను చూసుకోవడానికి పని మనుషులు కావాలని కొందరు యువతులను డింపుల్ హయాతి.. ఆమె భర్త బీహార్ నుంచి పిలిపించారు. ఆ పని మనుషులతో పని చేయించుకుని వారికి డబ్బులు ఇవ్వకుండా తన భర్తతో పరుష పదజాలంతో తిట్టించింది. ఈ విషయాన్ని బాధిత మహిళ బయటపెట్టింది.
పైగా, ఆ పని మనుషులపై మీరు నా చెప్పులు అంత వాల్యూ చేయరు. నువ్వు ఎంత మీ బ్రతుకు ఎంత అంటూ డింపుల్ హయాతి భర్త రెచ్చిపోయాడు. జీతం కూడా ఇవ్వకుండా ఇద్దరు యవతులను ఇంట్లో నండి వెళ్లగొట్టి... మా ఆయన లాయర్ మీరు నన్ను ఏపీ పీకలేరు అంటూ రెచ్చిపోయిన హీరోయిన్ డింపుల్ హయాతి.
గతంలో కూడా ఐపీఎస్ అధికారి హెగ్డేతో డింపుల్ హయాతి తగువు పెట్టుకుంది. ఐపీఎస్ అధికారి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును కాలితో తన్నడం, కారుతో ఢీకొట్టారు. జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్టుమెంటులో ఉంటున్న నటి హయాతి, ట్రాఫిక్ డీసీసీ రాహుల్ హెగ్డే ఉంటున్నారు. రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని పార్కింగు ప్లేసులో ఢీకొట్టారు.
ఐపీఎల్ అధికారి మాత్రం పలుమార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె మాత్రం ఏమాత్రం వినిపించుకోలేదు. పైగా, ఆమె ఆగడాలు మరింతగా శృతిమించడంతో రాహుల్ హెగ్డే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.