గుడ్లగూబల్లా మేల్కొనే టీనేజర్స్‌కి ఆ సమస్య తప్పదు..

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (17:48 IST)
అమ్మాయిలు రాత్రి నిద్రపోకుండా గుడ్లగూబల్లా మేలుకుంటున్నారా.. అయితే ఒబిసిటీ తప్పదని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. ముఖ్యంగా టీనేజీలో వున్నవారైతే.. ఒబిసిటీ ప్రభావం మరీ ఎక్కువగా వుంటుందని తాజా అధ్యయనంలో తేలినట్లు అమెరికా పరిశోధకులు వెల్లడించారు. 
 
తాజాగా పరిశోధన ప్రకారం.. రాత్రి పూట అధిక సమయం మేల్కొనే టీనేజీ అమ్మాయిలు బరువు పెరిగే ప్రమాదం పొంచి వున్నట్లు కనుగొన్నారు. ఇందులో భాగంగా రాత్రిపూట మేల్కొనే యువతులపై జరిపిన పరిశోధనలో.. నిద్రపోకుండా అదే పనిగా కంప్యూటర్లు, ఫోన్లతో కాలం గడిపే అమ్మాయిల్లో బరువు పెరిగిందని, హాయిగా నిద్రించే యువతుల్లో బరువు పెరిగే సమస్య లేదని వెల్లడయ్యింది. 
 
ఈ కథనం జర్నల్ జమా పీడియాట్రిక్స్‌లో ప్రచురితమైంది. అంతేగాకుండా ఈ పరిశోధనలో 418 మంది అమ్మాయిలు, 386 మంది అబ్బాయిలపై జరిగింది. వీరు 11 నుంచి 16 ఏళ్ల లోపు వారే. నిద్రపోయే గంటలు, నిద్రించే సమయం, రాత్రిళ్లు ఎన్నిగంటలు నిద్రపోతున్నారు, వారాంతాల్లో ఎంతసేపు నిద్రపోతున్నారనే వివిధ అంశాలపై పరిశోధన జరిగింది. ఇలా రాత్రి పూట అత్యధిక సమయం నిద్రపోకుండా వుండేవారిలో అధిక బరువు సమస్య ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు పరిశోధకులు గమనించారు.  
 
రాత్రిపూట నిద్రపోని వారిలో కొవ్వు శాతం పెరిగిందని, తద్వారా పొట్టపెరగడం, బరువు పెరగడం వంటివి బయటపడినట్లు పరిశోధకులు తెలిపారు. కానీ హాయిగా రాత్రిపూట 8 గంటలు నిద్రపోయే వారిలో ఈ సమస్య లేదని వెల్లడించారు. కనుక టీనేజీ యువత రాత్రిపూట ఎక్కువ సేపు ఫోన్లు, కంప్యూటర్ల ముందు గడపటం కంటే హాయిగా నిద్రపోవడం ద్వారానే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని అమెరికా పరిశోధకులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments