గర్భిణీ మహిళలు వెల్లకిలా పడుకుంటున్నారా? (video)

గురువారం, 5 సెప్టెంబరు 2019 (15:35 IST)
గర్భిణులు పక్కకు తిరిగి పడుకోవడం మంచిదా? లేదా? అనే విషయాన్ని తెలుసుకుందాం. 
 
గర్భిణులు పక్కకు తిరిగి పడుకోవడం మంచిదని, ఇలా చేస్తే కడుపులోనే బిడ్డ చనిపోయి పుట్టే ముప్పును తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
 
గర్భం ధరించాక 28 వారాల నుంచి వెల్లకిలా పడుకునే వారికి మృతశిశు జననం ముప్పు 2.6 రెట్లు ఎక్కువగా ఉందని తాజా అధ్యయనంలో తేలింది. మృతశిశు జననానికి దోహదం చేసే ఇతరత్రా కారణాలతో నిమిత్తం లేకుండానే ఈ ముప్పు కనబడుతుండటం విశేషం. 
 
పక్కకు తిరిగి పడుకున్నప్పటితో పోలిస్తే వెల్లికిలా పడుకున్నప్పుడు పిండానికి 80% మేరకు రక్త సరఫరా తగ్గుతోందని ఆ పరిశోధనలో పరిశోధకులు గుర్తించారు. కాబట్టి 28 వారాల తర్వాత పక్కకు తిరిగి పడుకోవటమే మేలని సూచిస్తున్నారు. కుడి, ఎడమ పక్కలకు ఎటువైపు తిరిగి పడుకున్నా మంచిదేనని వివరిస్తున్నారు. కానీ వెల్లకిలా మాత్రం గర్భిణీ మహిళలు పడుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రోజూ వర్షంలో తడుస్తున్నారా? అయితే, ఇలా చేయండి...