Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజూ వర్షంలో తడుస్తున్నారా? (video)

Advertiesment
Rainy Season
, గురువారం, 5 సెప్టెంబరు 2019 (15:20 IST)
దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరభారతదేశాన్ని వర్షాలు ముంచెత్తిపోస్తున్నాయి. అలాగే, కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అయితే, ఈ వర్షాల్లో అనేక మంది పదేపదే తడుస్తుంటారు. దీంతో వారు అనారోగ్యంబారిన పడుతున్నారు. ఈ వర్షాకాలంలోనే అధికంగా సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. మరి వర్షకాలంలో ఎలాంటి జగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండగలమో చూద్దాం.
 
* వర్షాకాలంలో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా, వర్షపు నీరుతో పాటు.. మురుగు నీరు తాగునీరులో కలిసిపోయి సరఫరా కావొచ్చు. అందువల్ల నీటిని కాచి చల్లార్చి తాగడం అలవాటు చేసుకోవాలి. లేదంటే ప్యూరిఫైడ్ నీటిని తీసుకోవాలి. నీటి ద్వారానే వర్షాకాలంలో చాల వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా జలుబు, గొంతునొప్పి, కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, పచ్చకామెర్లు వంటి వ్యాధులన్నీ నీటితోనే వ్యాప్తి చెందుతాయి.
 
* సాధారణంగా వర్షంలో ఒక్కసారి తడిసినా చాలు.. చాలా మందికి జలుబు బారినపడుతుంటారు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం ఎక్కువగా వస్తుంటాయి. సైనస్‌ వస్తే పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. విపరీతమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో వర్షంలో తడవకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ తడిస్తే వెంటనే తల, ఒళ్లు తుడుచుకుని పొడి దుస్తులు మార్చుకోవాలి. వేడిపాలల్లో పసుపు వేసుకుని తాగడం, నువ్వులు, బెల్లంలాంటివి ఆహారంలో భాగం చేసుకోవడం, వేడినీటిలో ఉప్పు వేసి పుక్కిలించడం, ముఖానికి నీటి ఆవిరి పట్టడం వల్ల ఉపశమనం ఉంటుంది.
 
* వర్షాకాలంలోనే సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. వీటికి ప్రధాన కారణం దోమకాటు. మలేయా, డెంగ్యూ, ఫైలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు దోమకాటుతోనే వస్తాయి. దీని కోసం మన ఇళ్లల్లో దోమలు ఆవాసం ఏర్పరచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎక్కడబడితే అక్కడ చెత్తా చెదారంతో నింపితే దోమలు అక్కడ వాలి పై వ్యాధులకు కారణమవుతాయి.
 
* వర్షాకాలం కలుషిత నీరు, కలుషిత ఆహార పదార్థాల కారణంగా నీళ్ల విరోచనాల వ్యాధి కూడా రావచ్చు. ప్రధానంగా అలాంటి సందర్భాల్లో వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. చిన్నపిల్లలు, వృద్ధుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. కాచి వడబోసిన నీటినే తాగాలి. ఆహార పదార్థాలపై మూత పెట్టి ఉంచడం మరిచి పోకూడదు.
 
* వర్షాకాలంలో టైఫాయిడ్‌ జ్వరం కూడా ఎక్కువగానే ఉంటుంది. కలుషిత ఆహారం, నీటి ప్రభావంవల్ల ఇనఫెక్షన్ సోకి జ్వరం వస్తుంది. తగ్గకుండా చాలా రోజులు బాధిస్తుంది. దాంతో పాటు కడుపునొప్పి, డయేరియా, తలనొప్పి వంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం ఎక్కువ రోజులు తగ్గకపోయినా టైఫాయిడ్‌ అని అనుమానం వచ్చినా, వీలైనంత తొందరగా డాక్టర్‌ను సంప్రదించడం మేలు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టమోటా వల్ల కలిగే ప్రయోజనాలు..