Publish Date: Sun, 11 Aug 2019 (13:49 IST)
Updated Date: Sun, 11 Aug 2019 (13:51 IST)
కారం.. కారం.. అంటూ ఆహారాన్ని పక్కనబెట్టేస్తున్నారా? కారంగా వుంటే కాస్త తినండి అంటున్నారు.. వైద్యులు. కారాన్ని ఆహారంలో కొంచెం అయినా తీసుకోవాలి. మోతాదుకు మించి కారం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కారం అనేది డైట్‌లో తప్పకుండా వుండాలని చెప్తున్నారు న్యూట్రీషియన్లు.
ఎందుకంటే..? ఎండు మిరపకాయల పొడిలో ఉండే పలు రకాల సమ్మేళనాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా చూస్తాయని తాజా పరిశోధనలో వెల్లడి అయ్యింది. కారం తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.
గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో కారాన్ని ఆహారంలో చేర్చుకోవాలి. కొంచెం ఘాటుగా వున్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా దగ్గు, జలుబును దూరం చేసుకోవచ్చు. ఈ రెండూ ఉన్నవారు కారం తింటే త్వరగా ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మిరపకాయల్లో ఉండే క్యాప్సెయిసిన్ అనబడే సమ్మేళనం అధిక బరువు తగ్గించడంలో సహాయ పడుతుంది. వాపులను తగ్గిస్తుంది. తలనొప్పి, కీళ్ల నొప్పులు ఉన్నవారు కారం తింటే ఆయా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.