Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుఖ నిద్రకోసం ఎలా పడుకోవాలో తెలుసా?

సుఖ నిద్రకోసం ఎలా పడుకోవాలో తెలుసా?
, శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (22:43 IST)
చాలామంది నిద్రకు ఉపక్రమించే సమయంలో ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటారు. కొంతమందైతే బోర్లా పడుకుంటారు. కానీ అలా నిద్రపోకూడదట. ఉత్తరం వైపు తరచూ తలపెట్టుకుని పడుకుంటే ఆయుష్షు తగ్గిపోతుందట. అయితే మన వైద్యశాస్త్రంలో కూడా కొన్ని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయట. ఏంటవో తెలుసుకుందామా.
 
నిద్రించేటప్పుడు ఉత్తరం వైపు తలపెట్టుకుని నిద్రిస్తే.. మన శరీరం భూమధ్య రేఖ నుంచి 40 డిగ్రీల అక్షాంశం దాకా ఆకర్షణ శక్తీ ఎక్కువుగా ఉంటుంది. ఉత్తర ధృవం సమీపించే కొద్దే ఇది తగ్గుతుందట. మన దేశం 40 డిగ్రీల ఉత్తర అక్షాంశం రేఖ మధ్య ఉన్నది కావున ఈ ఆకర్షణ శక్తీ ప్రభావం ఇంక ఎక్కువుగా ఉంటుందట. ఈ సూత్రం ప్రకారం దక్షిణం నుంచి ఉత్తరం దిక్కుకు ఆకర్షణ శక్తీ ప్రవహిస్తుంటుంది. దీనివల్ల శరీరంలో కొన్ని మార్పులు చోటుచేసుకొంటాయి. దీంతో కొన్ని రసాయనాలు తయారై రోగ నిరోధక శక్తి పెరుగుతుందట.
 
ఇది ప్రకృతి సిద్ధమైన నిరంతర ప్రక్రియ. మన శరీరంలో ఇనుము, నికెల్, కోబాల్ట్ వంటి లోహ పదార్థాలు ఉంటాయి కాబట్టి వీటిపై గురుత్వాకర్షణ శక్తీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ పదార్థాలు ఉత్తర,దక్షిణ ధృవాల్లో కేంద్రీకృతమవుతాయి. అంటే ఉత్తరం దిక్కుగా తల పెట్టినప్పుడు మెదడు, అరికాళ్ళు దగ్గర ఈ పదార్థాలు ధృవాలుగా ఏర్పడతాయట. సహజసిద్ధమైన ఆకర్షణ శక్తి శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుపడతాయట. 
 
దీనివల్ల శరీరంలో బ్యాక్టీరియా వృద్ధి చెందడమే కాకుండా, రోగనిరోధక శక్తీ తగ్గుతుంది. ఈ కారణాల వల్ల మనిషి తొందరగా రోగాల బారిన పడుతాడు. వాస్తుశాస్త్ర రీత్యా తూర్పు, దక్షిణ దిశలలో మాత్రమే తల ఉంచి పడుకోవాలనే నియమం ఉంది. పురాణాల్లో కూడా దీనికి కారణాలుఉన్నాయి. సూర్యుడు మనకు ప్రత్యక్ష దేవుడు కనుక ఆయనవైపు కాళ్ళు ఉంచి నిద్రించకూడదనేది ఓ కారణంగా కాగా నిద్రలేవడం ఆలస్యమైతే సూర్యకాంతి కళ్ళలో పడుతుదనేది మరో కారణం. ఉత్తరం వైపు తలపెడితే లేవడంతోనే దక్షిణ దిశాధిపతి అయిన యముడి దర్శనం అవుతుందట. 
 
అందుకే ఉత్తరం వైపు తల ఉంచకూడదనే నియమం ఏర్పడింది. అంతేగాకుండా వినాయక జన్మవృత్తాంతంలో కూడా ఈ విషయం వివరించబడిందట. మరణించిన తన పుత్రునికి ఈశ్వరుడు ఉత్తరదిక్కుకి తలపెట్టుకొని నిద్రిస్తున్న వారి తలను తీసుకురమ్మని ప్రమాదగణాలను ఆదేశించటం, గజాసురుని తల తెచ్చి వినాయకునికి అతికించడం మనకు తెలుసు. దీనికి శాస్త్రసంబంధమైన విశేషాలు కూడా ఉన్నాయట. తూర్పు నుంచి వచ్చే ప్రకృతిబద్ధమైన కాంతులు శరీరానికి అంతటికి ఆరోగ్యదాయకమైనవి. దక్షిణ, నైరుతి దిక్కులు నుంచి వచ్చే శీతలపవనాల వల్ల సుఖ నిద్ర కలుగుతుందని ఆరోగ్యసూత్రాలు చెబుతున్నాయట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనిషి హాయిగా వుండాలంటే అవి వదిలేయాలి... ఇవి చేయాలి