Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లయిన దగ్గర్నుంచి పాము-ముంగిసలా కొట్టుకుంటున్నాం...

Advertiesment
parents
, శనివారం, 10 ఆగస్టు 2019 (19:19 IST)
మా జాతకాలు ఏమయినా కలవలేదేమోనని నాకు డౌటుగా ఉంది. పెళ్లయిన దగ్గర్నుంచి పాము-ముంగిసలా కొట్టుకుంటున్నాం. అంటే... దెబ్బలాట కాదు. పోట్లాట. చిన్నచిన్న విషయాలకే ఆయన నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏదోవిధంగా విసిగిస్తుంటాడు. ఎవరి పనులకు వారు వెళ్లిపోయినప్పటికీ పొద్దస్తమానం ఫోన్లు చేసి సిల్లీ థింగ్స్ గురించి మాట్లాడి గొడవ పెట్టుకుంటాడు. 
 
సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ మొదలెడతాడు. రాత్రిపూట బెడ్ మీద కూడా చిన్నచిన్న పనులకే ఇంతెత్తున లేస్తాడు. అవన్నీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను. అంతేకాదు... రాత్రి బెడ్ పైన జరిగినవన్నీ తన పేరెంట్స్, ఫ్రెండ్స్‌కు చెప్పేస్తుంటాడు. ఈమధ్య తన స్నేహితులు నాతో మాట్లాడినప్పుడు ఈ విషయం తెలిసింది. ఇతడికేమైనా మెంటలేమోనని నాకు డౌట్‌గా ఉంది. ఏం చేయమంటారు...?
 
పెళ్లయిన కొత్తల్లో చాలా జంటలు ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడం కామనే. కొన్ని నెలలు ఇలాగే చిన్నచిన్న విషయాలనే భూతద్దంలో చూడటం జరుగుతుంటుంది. ఆ తర్వాత ఒకరికొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఎలాంటి సమస్యలు తలెత్తవు. భర్త చెప్పినవాటిని ఆచరిస్తూనే, తమదైన పంథాలో తెలివిగా ముందుకు వెళితే అతడే మీ చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. అప్పుడు మీరు ఏది చెబితే దానిని ఆయన పాటిస్తారు. కాబట్టి అంతవరకూ ఓర్పుగా ఉండండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉల్లి కాడల వల్ల కలిగే ప్రయోజనాలు