Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలూ.. Hug your parents.. తల్లిదండ్రులు కూడా మరిచిపోకండి

పిల్లలూ.. Hug your parents.. తల్లిదండ్రులు కూడా మరిచిపోకండి
, గురువారం, 25 జులై 2019 (13:36 IST)
తల్లిదండ్రులు పిల్లలను ఆప్యాయంగా పలకరించడం చేయాలి. వారి భావాలను అర్థం చేసుకోగలగాలి. యాంత్రిక జీవనానికి అలవాటు పడి.. పిల్లలను సైతం యాంత్రికమై జీవనానికి అలవాటు చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది.


స్కూల్, ట్యూషన్స్ ఇతరత్రా కార్యక్రమాల్లో పిల్లలను నిమగ్నం చేసి వయస్సుకు మించి ఒత్తిడిని వారిపై మోపే వారి సంఖ్య పెరిగిపోతుంది. అలాకాకుండా బిజీ బిజీగా గడపకుండా పిల్లల కోసం సమయాన్ని కేటాయించాలి. వారితో కూర్చుని మాట్లాడాలి. తల్లిదండ్రులుగా మీపై వున్న బాధ్యతను విస్మరించకూడదు. 
 
అందుకే.. పిల్లల ఆహారం, పెరుగుదల, మానసిక పరిపక్వతపై ఓ కన్నేసి వుంచాలి. వారి మనస్సును ఆహ్లాదకరంగా వుంచాలి. వారిలో ఉత్సాహాన్ని నింపాలి. ఇందుకోసం వారితో నవ్వుతూ పలకరించడం.. వారి చేసే చిన్న చిన్న పనులను ప్రోత్సహించడం.. వారికి ఆప్యాయంగా ముద్దులివ్వడం.. కౌగలించుకోవడం చేయాలంటున్నారు.. చైల్డ్ కేర్ నిపుణులు. ముఖ్యంగా పిల్లలను తల్లిదండ్రులు ఆప్యాయంగా కౌగిలించుకుంటే ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. 
 
అలా తల్లిదండ్రుల కౌగిలింతలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో చూద్దాం.. కౌగిలింత అనేది పిల్లలను మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుందట.
webdunia


పిల్లలకు తల్లిదండ్రులు ఆప్యాయంగా ఇచ్చే ఒక కౌగలింత చిన్నారుల్లో ఒక చక్కటి ధృడమైన అనుబంధం ఏర్పడటంతో పాటు, వారిని నిత్యం సంతోషంగా ఉండేలా చూసుకోవచ్చు. ఫలితంగా వారు అన్ని రకాలుగా ఆరోగ్యంగా తయారవుతారు. 
 
ఈ విషయం పలు అధ్యయనాల్లో కూడా తేలింది. రోజుకు 12 సార్లైనా పిల్లలను ఆప్యాయంగా కౌగలించుకోవాలని.. చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం స్నానం చేయించిన తర్వాత, పడుకునే ముందు ఆకలి తీర్చిన తర్వాత ఇలా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వారిని హత్తుకుంటుండాలి. ఇలా చేయటం వల్ల వారిలో పెరుగుదలకు సహాయపడే హార్మోన్ సక్రమంగా విడుదలై ఎదుగుదల బాగుండేందుకు తోడ్పడుతుంది.
 
తల్లి కౌగలింతలో ప్రేమ. ఎక్కువ సమయం వారిని గుండెలకు హత్తుకొన్నప్పుడు వారి శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. దీన్ని హ్యాపీ హార్మోన్ అని కూడా పిలుస్తారు.
webdunia


ఎంత బిజీగా ఉన్నా చిన్నారులను కాసేపు హత్తుకోవడం ద్వారా వారిని సంతోషంగా ఉంచేలా చేయవచ్చు. దీనికోసం చిన్నారులను కనీసం 20 సెకన్ల పాటు హాగ్ చేసుకోవాల్సి ఉంటుందని నిపుణుల సూచిస్తున్నారు
 
ప్రస్తుత రోజుల్లో నెలల వయస్సున్న పిల్లల్ని సైతం ఇంట్లో పెద్దల వద్ద లేదా నర్సరీలు, క్రష్‌లలో వదిలి కార్యాలయాలకు వెళుతున్నారు. ఇలారోజంతా అమ్మానాన్నలకు దూరంగా సమయం గడపాల్సి రావడం వారిలో అభద్రతా భావాన్ని పెంచుతుంది. 
webdunia
 
స్కూల్ పిల్లల్లో కూడా చదువులతో భారం పడుతుంది, ఇటువంటి సమయంలో వారికి ఒత్తిడి కలుగుతుంది. ఒత్తిడి తగ్గించి, పిల్లలు సంతోషంగా ఉండాలంటే ఒక చిన్న హగ్ ఇస్తే చాలు వారిలో సంతోషానికి కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్ వారిలో ఒత్తిడిని దూరం చేస్తుందని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శంకరాభరణం శంకరశాస్త్రి అంటే ఎవరో తెలుసా?