Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

ఠాగూర్
శుక్రవారం, 17 మే 2024 (11:11 IST)
చెన్నై మహానగరంలో దారుణం జరిగింది. ఓ టీవీ యాంకర్ అత్యాచారానికి గురైంది. నిద్ర మాత్రలు కలిపిన జ్యూస్ ఇవ్వడంతో ఆమె మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత ఆమెపై ఓ పూజారి అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ యాంకర్ గర్భందాల్చింది. తాజాగా చెన్నై సాలిగ్రామం ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నెలోని ప్రధాన అమ్మన్ ఆలయాల్లో ఒక ఆలయంలో కార్తీక్ మునుస్వామి పూజారిగా ఉన్నారు. ఈయన చేతిలో తాను అత్యాచారానికి గురైనట్టు ఆ యాంకర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తాను ఆధ్యాత్మిక వ్యక్తినని, తరచుగా ఆలయాలను సందర్శిస్తుంటానని తెలిపింది. 
 
చెన్నైలోని ప్యారీస్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ కాళికంపాల్ ఆలయానికి తరచుగా వెళ్తుంటానని... ఈ క్రమంలో తనకు ఆలయ పూజారి కార్తీక్ మునిస్వామితో పరిచయం ఏర్పడిందని తెలిపింది. ఈ స్నేహంతో తాను గుడికి వచ్చినప్పుడల్లా గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం చేయించేవాడని చెప్పింది.
 
ఈ క్రమంలో తమకు స్నేహం పెరిగిందని... ఒకరోజు తాను గుడికి వచ్చినప్పుడు తన బెంజ్ కారులో డ్రాప్ చేస్తానని చెప్పాడని... కారులో ప్రయాణిస్తుండగా తీర్థం ఇచ్చాడని, దీన్ని తాగిన తర్వాత తనకు స్పృహ తప్పిందని ఆమె తెలిపింది. ఆ తర్వాత తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. 
 
ఇది జరిగిన తర్వాత తనను గుడిలోనే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని... ఆ తర్వాత చాలాసార్లు తమ ఇంటికి వచ్చాడని, తాను గర్భవతిని అయ్యానని తెలిపింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడని... ఆ తర్వాత తనను వ్యభిచారం చేయమని బలవంతం చేశాడని పేర్కొంది.
 
ఆమె ఫిర్యాదుతో పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలు, వీడియోలను అతని ఫోన్ నుంచి పోలీసులు రికవరీ చేశారు. ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన బాధితురాలు చెన్నైకి చెందిన ఓ టీవీ ఛానల్‌లో పని చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రౌతు కా రాజ్ వంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల‌ను ఎంజాయ్ చేస్తుంటా : న‌వాజుద్దీన్ సిద్ధిఖీ

పీరియాడిక్ యాక్షన్ తో దసరాకు సిద్దమైన హీరో సూర్య చిత్రం కంగువ

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments