ఆంధ్రప్రదేశ్‌కు వైజాగ్ గ్రోత్ ఇంజిన్ అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాను సీఎంగా వైజాగ్‌లో ఉండగలిగితే పదేళ్ల తర్వాత ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుందని జగన్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులతో వైజాగ్ సమానంగా ఉంటుంది.
వచ్చే ఎన్నికల తర్వాత వైజాగ్‌లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ చెప్పారు. విజయవాడ, అమరావతి, గుంటూరులో చేయలేని మౌలిక సదుపాయాలను వైజాగ్‌లో రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేయవచ్చని ఆయన సూచించారు.
ఈ ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, రైతాంగం, ప్రజా సంక్షేమం, మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి రంగాలను బలోపేతం చేశామన్నారు. అవి మాత్రమే కాకుండా పోర్టులు, విమానాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్లు శరవేగంగా జరుగుతున్నాయి.
ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి రాజధాని నుంచి తన పరిపాలన ప్రారంభిస్తాడో.. అప్పుడు ఈ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అందుకే ఈసారి ఆయన ప్రమాణస్వీకారం విశాఖ నగరం నుంచే ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.