Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అదంతా జీవితంలో ఓ భాగం : ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై రోహిత్ శర్మ

rohit sharma

ఠాగూర్

, శుక్రవారం, 3 మే 2024 (10:01 IST)
జీవితంలో అన్నీ మనం కోరుకున్నట్టుగా జరగవని, అదంతా జీవితంలో ఓ భాగమని రోహిత్ శర్మ అన్నారు. ఐపీఎల్ 2024 ఫ్రాంచైజీ జట్లలో ఒక్కటైన ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించి హార్దిక్ పాండ్యాను యాజమాన్యం ఎంపిక చేసింది. దీనిపై రోహిత్ శర్మ స్పందిస్తూ, జీవితంలో అన్నీ అనుకున్నట్టుగా జరగవని వ్యాఖ్యానించారు. 
 
"ఇదంతా జీవితంలో ఓ భాగం. మనం అనుకున్నవన్నీ జరగవు. కానీ, ఈ ఐపీఎల్‌ సీజన్ నాకో మంచి అనుభవం. నేను గతంలో కూడా ఇతర కెప్టెన్ల సారథ్యంలో ఆడాను. పాండ్యా నేతృత్వంలో ఆడటం కూడా అలాగే ఆడాను" అని రోహిత్ చెప్పుకొచ్చారు. ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, గిల్‌క్రిస్ట్, హర్భజన్ సింగ్, రికీ పాంటింగ్ తదితరుల నేతృత్వంలో ఆడిన విషయం తెల్సిందే. 
 
పరిస్థితులకు అనుగుణంగా మసలుకోవాల్సి వుందన్నారు. పరిస్థితి ఎలా ఉంటే అలా నడుచుకోవాలి. టీం కోసం చేయగలిగినంత చేయాలి. గత నెల రోజులుగా నేను అదే చేస్తున్నాను అని చెప్పారు. ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు రోహిత్ 10 ఇన్నింగ్స్‌లలో 314 పరుగులు చేశారు. కాగా, అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్న రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టీం కెప్టెన్సీని కోల్పోవడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. ఇక అభిమానులైతే నిరాశలో కూరుకుపోయారు. రోహిత్ స్థానంలో ఎమ్‌ఐ పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యాపై ట్రోలింగ్‌కు దిగారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతడి గుండె బద్దలైంది... టీ20 వరల్డ్ కప్‌లో రింకూ సింగ్‌కు నో బెర్త్.. తండ్రి కామెంట్స్