Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నై సిటీలో పిల్లి బిర్యానీ, కుక్క బిర్యానీ... యాక్ థూ.......

Cats Massaging Dog

సెల్వి

, గురువారం, 2 మే 2024 (17:37 IST)
చెన్నై సిటీలో బిర్యానీ తింటున్నారా.. అయితే మీకు ఓ బ్యాడ్ న్యూస్. చెన్నైలోని స్ట్రీట్ ఫుడ్‌లో వడ్డించే బిర్యానీలో చికెన్ మటన్ ముక్కలకంటే.. పిల్లి, కుక్కల మాంసం వడ్డిస్తున్నారనే వార్త అందరినీ షాక్‌కు గురిచేసింది. 
 
ఇందుకోసం చెన్నైలో రోడ్డుపై తిరుగుతున్న శునకాలు, పిల్లులను రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు దొంగలించి వాటి మాంసం విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
 
గత కొన్ని రోజుల క్రితం చెన్నై కీల్పాక్కం కులక్కరై రోడ్డులో వివిధ వీధిలలో తిరుగుతూ వుండిన పిల్లులను కొందరు పట్టుకెళ్తున్నారని.. వారిపై పోలీసులకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని జంతు సంరక్షణ కార్యకర్త జోస్వా ఆరోపించారు. 
 
రాత్రిపూట నగరంలో ఇలా పిల్లులను, కుక్కలను పట్టుకెళ్లి ఏం చేస్తున్నారు? వాటిని ఎందుకలా పట్టుకుంటున్నారు? రాత్రి పూట ఆయుధాలతో కుక్కలను, పిల్లులను ఎందుకు పట్టుకెళ్తున్నారు.. రాత్రి పూట ఇలాంటి వ్యక్తులు రోడ్డుపై తిరుగుతుంటే.. భద్రత ఎక్కడ వుందని.. వాపోయారు. 
webdunia
animal activist
 
జంతువులను సంరక్షించకపోయినా వాటిని హింసించే హక్కు ఎవరికి లేదని ఆయన మండిపడ్డారు. ఇందుకు సంబంధించి జంతు సంక్షేమ సంస్థలు స్వచ్ఛంధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 
 
అర్థరాత్రి పిల్లులను పట్టుకెళ్లి బిర్యానీ షాపులకు అమ్మేస్తున్నారని.. ఆ పిల్లికి వందరూపాయల మేర ఇస్తే.. వాటిని వదిలేస్తామని చెప్పినట్లు జోస్వా చెప్పారు. ఇదే తంతు కొనసాగితే పిల్లులు, కుక్కలను కార్టూన్ ఛానల్‌లోనే చూడాలని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజ్వల్ రేవణ్ణ ఒక మాస్ రేపిస్ట్.. రాహుల్ ఆరోపణల : ఏకంగా 400 మంది మహిళలపై..