స్నేహితుడి భార్యపై వ్యక్తి అత్యాచారం.. విడాకులిచ్చిన భర్త

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (22:13 IST)
తన స్నేహితుడి భార్యపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు కట్టుకున్న భర్తకు చెప్పింది. తన భార్యపై లైంగికదాడికి పాల్పడిన స్నేహితుడిని మందలించాల్సిన భర్త ఆ పని చేయకపోగా, కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చి ఇంటికి పంపించేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భోపాల్‌కు చెందిన 28 ఏళ్ల హిందూ మహిళకు ముస్లిం వ్యక్తితో పెళ్లి జరిగింది. అనంతరం ఆమె కూడా తన భర్తకు చెందిన ముస్లిం మతాన్ని స్వీకరించింది. 
 
పెళ్లైన కొంత కాలం తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్త స్నేహితుడు హసీబ్ సిద్ధిఖీ, ఆ దంపతుల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు చొరవచూపాడు. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్‌ 28న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
 
కాగా, ఆ మహిళ జరిగిన దారుణాన్ని భర్తకు చెప్పింది. అయితే అతడు తన స్నేహితుడిపై ఎలాంటి చర్య తీసుకోలేదు కదా కనీసం మందలించను కూడా లేదు. భార్యపై అత్యాచారం చేసిన సిద్ధిఖీపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పైగా భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. 
 
దీంతో బాధితురాలు ఇండోర్‌కు వెళ్లింది. అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఇండోర్‌ పోలీసులు ఆ కేసును భోపాల్‌లోని గౌతమ్ నగర్ ప్రాంతం పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన సిద్ధిఖీతోపాటు మహిళ భర్తను కూడా అరెస్ట్‌ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం