Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కదిరి గంగమ్మ గుడివద్ద 58 యేళ్ల హిజ్రాపై అత్యాచారం

Advertiesment
woman victim
, శుక్రవారం, 22 జులై 2022 (10:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత, పులివెందులు శాసనసభ్యుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డకు చెందిన కొందరు కామాంధులు ఓ హిజ్రాపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి వయసు 58 యేళ్లు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పులివెందులకు చెందిన చక్రధర్, చలపతి, బాలగంగిరెడ్డి, గురు ప్రసాద్, కుమార్, బ్రహ్మయ్య, జయచంద్రశేఖర్ రెడ్డి, హరికృష్ణారెడ్డి తరుణ్, బాబావల్లి, ప్రైవేటు స్కూల్ టీచర్ సురేంద్ర, షాకీర్, సుభాష్ అనే వేరు ఓ పంచాయతీ విషయంలో రెండు వాహనాల్లో సత్యసాయి జిల్లాలోని రాగన్నగారిపల్లెకు వెళ్లారు. 
 
అక్కడ పని ముగించుకుని తిరిగి పులివెందులకు కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో కదిరి రహదారిలోని గంగమ్మ గుడి వద్ద ఉన్న హిజ్రాల్లో తొలుత ఒక హిజ్రాపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధిత హిజ్రా దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని కదిరి ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ఉన్న నిందితుల్లో 8 మంందిని అరెస్టు చేశారు. మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు. కేసు విచారణ జరుపుతున్నట్టు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల