Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎఐఓసీడీ ఆంధ్రప్రదేశ్‌ సభ్యులకు రుణాలందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న పూనావాలా ఫిన్‌కార్ప్‌

Advertiesment
Cash
, మంగళవారం, 19 జులై 2022 (22:54 IST)
డిపాజిట్లు తీసుకోని ఒక వ్యవస్థాగతమైన కీలక బ్యాంకింగేతర ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌డీ-ఎస్‌ఐ-ఎన్‌బీఎఫ్‌సీ) పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (గతంలో మ్యాగ్మా ఫిన్‌కార్ప్), ఆల్-ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ (ఎఐఓసీడీ)కు భారతదేశవ్యాప్తంగా ఉన్న సంస్థ సభ్యులకు ప్రత్యేక వడ్డీతో రుణాలు అందించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా కెమిస్ట్, డిస్ట్రిబ్యూషన్ సోదరుల వివిధ ఫైనాన్సింగ్ అవసరాలు తీర్చడానికి ఎఐఓసీడీ సభ్యులకు బిజినెస్ లోన్స్‌, ఆస్తిపై రుణం, ప్రీ-ఓన్డ్ కార్లు, హోమ్ లోన్స్‌ వంటి వాటిని పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (పీఎఫ్‌ఎల్‌) అందించనుంది.
 
ఈ భాగస్వామ్యం ద్వారా విజయవాడ సహా ఆంధ్రప్రదేశ్‌లోని 17 ప్రాంతాలలోని సుమారు 29,000 మంది కెమిస్టులకు పూనావాలా ఫిన్‌కార్ప్ సేవలు అందనున్నాయి. ఈ భాగస్వామ్యం గురించి పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మనీష్ చౌదరి మాట్లాడుతూ, “కెమిస్ట్, డ్రగ్గిస్ట్ సోదరులకు  మా సేవలందించేందుకు ఎఐఓసీడీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు సంతోషం కలిగిస్తోంది. మా ఆర్థిక సాధనాలు  ఎఐఓసీడీ సభ్యులు తమ జీవిత లక్ష్యాలు సాకారం చేసుకోవడంతో పాటు వారి వ్యాపార వృద్ధి, వ్యక్తిగత ఆకాంక్షలకు శక్తిని ఇస్తాయని మేము విశ్వసిస్తున్నాము. పరిశ్రమలకు చెందిన  ఇటువంటి స్వతంత్ర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా మా ఉత్పత్తులను ప్రత్యేక రేట్ల ద్వారా అందించడం వలన ఇరువురికి మంచి ఫలితం ఉంటుందని మేము దృఢంగా విశ్వసిస్తున్నాం” అన్నారు.
 
పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్‌తో టై-అప్ గురించి ఎఐఓసీడీ ప్రెసిడెంట్ జె.ఎస్‌. షిండే మాట్లాడుతూ “పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్‌తో మా భాగస్వామ్యం మా సభ్యుల లిక్విడిటీ సంక్షోభాన్ని పరిష్కరించడంలోనూ వారికి ఆర్థిక సాయం అందించడంలోనూ, సరఫరాదారుల నుంచి మెటీరియల్‌ కొనుగోలులో క్యాష్‌ డిస్కౌంట్స్‌ పొందేందుకూ అవకాశం కల్పిస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా మా సభ్యులు ప్రత్యేక రేట్లపై లోన్ ఉత్పత్తుల ప్రయోజనాలు పొందడమే కాదు పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ అందించే ఎండ్‌-టూ-ఎండ్‌ డిజిటల్‌ అనుభూతిని సంపూర్ణ లోన్‌ కాలం పొందగలుగుతారని మేము విశ్వసిస్తున్నాము” అన్నారు.
 
శ్రీ రాజీవ్ సింఘాల్, జనరల్ సెక్రటరీ- ఎఐఓసీడీ మాట్లాడుతూ, “ఇది ఒక ప్రధాన వ్యాపార వ్యూహాన్ని బలపరచడమే కాదు పోటీతత్వ ప్రయోజనాన్ని సృష్టించి, పోటీదారులు మార్కెట్‌ వర్గాలను ఆశ్రయించకుండా నిరోధించేందుకు దోహదపడే ఉమ్మడి సంకల్పం  ఇది.  ఇది సొంతంగా సాధించే దానికంటే సంస్థలకు మరింత ఎక్కువ అందిస్తుంది” అన్నారు.
 
పరిశ్రమలకు చెందిన వివిధ సంఘాల్లోని సభ్యులకు ఎంపిక చేసిన రేట్లపై రకరకాల ఉత్పత్తులు అందించేందుకు పూనావాలా ఫిన్‌కార్ప్ భాగస్వామ్యాలు కుదుర్చుకుంది.  కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎఐ) వంటి సంస్థలతో పూనావాలా ఫిన్‌కార్ప్‌ గతంలో ఒప్పందాలు కుదుర్చుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘మండి’పోతున్న యూరప్, పోర్చుగల్, స్పెయిన్‌లో వడగాలులతో చనిపోతున్న ప్రజలు