Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుమార్తెను ప్రియుడితో అత్యాచారం చేయించిన కన్నతల్లి.. ఎక్కడ?

Advertiesment
victim
, బుధవారం, 20 జులై 2022 (08:28 IST)
కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లి ఆమె పాలిట కిరాతకురాలిగా మారింది. తన శారీరకసుఖం కోసం తన ప్రియుడి కామవాంఛను తన కుమార్తెతో తీర్చింది. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లా అల్లినగరంలోని కకంజి కాలనీకి చెందిన ముత్తుచెల్వి, జయరామ్ అనే దంపతులు ఉన్నారు. వీరికి 16 యేళ్ల కుమార్తె ఉంది. ఈ బాలిక ఒక ప్రైవేట్ స్కూల్‌లో 11వ తరగతి చదువుతోంది. జయరామ్ కుటుంబ పోషణ నిమిత్తం కేరళలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఈ క్రమంలో ముత్తుసెల్వికి కెన్నడీ అనే సినీ దర్శకుడు పరిచయమయ్యాడు. 
 
తంజావూరుకు చెందిన ఈ సినీ దర్శకుడికి రాకమ్మల్ అనే చైల్డ్ ఆర్టిస్ట్‌లను సప్లయ్ చేసే మధ్యవర్తి ద్వారా ముత్తుచెల్వి పరిచయమైంది. ఈ పరియచం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్ది రోజుల తర్వాత అతని కన్ను ముత్తుసెల్వి 16 యేళ్ల కుమార్తెపై పడింది. 
 
అదేసమయంలో తన కుమార్తెను చైల్డ్ ఆర్టిస్ట్‌ను చేయాలని భావించిన ముత్తుచెల్వి ఆ ఆలోచనను పూర్తిగా పక్కనపెట్టి దర్శకుడు చెప్పినట్టు నడుుకోసాగింది. తల్లిలోని మార్పును గుర్తించిన కుమార్తె ఆమెను నిలదీసింది. పైగా, కెన్నడీతో ఉన్న అక్రమ సంబంధాన్ని మీ నాన్నకు గానీ.. మరెవరికైనా గానీ చెబితే తాను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానని కూతురిని ముత్తుచెల్వి బెదిరించింది. దీంతో.. ఆ బాలిక విషయం తెలిసినా ఎవరితో చెప్పలేదు.
 
ఈ క్రమంలో ముత్తుచెల్వి కూతురిని చూసిన దర్శకుడు కెన్నెడీ ఆమెపై మనసు పారేసుకున్నాడు. తనలోని నీచమైన ఆలోచనను ముత్తుసెల్వికి చెవినపడేశాడు. తొలుత వెనుకంజ వేసినప్పటికీ ఆ తర్వాత ప్రియుడి కోరికను తీర్చేందుకు సమ్మతం తెలిపింది. ఓ రోజున తన కుమార్తె తాగే కాఫీలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. 
 
ఆ బాలిక కాఫీని తాగి మత్తులోకి వెళ్లాక ఆ దర్శకుడు ఆమెను మానభంగం చేశాడు. అయితే.. తనపై మానభంగం జరిగిందని గ్రహించిన ఆ బాలిక తీవ్ర మనోవేదన చెందింది. పెదనాన్న వాళ్ల ఇంటికి వెళ్లి తల్లి నీచత్వాన్ని పూసగుచ్చినట్టు చెప్పింది. ఆ బాలిక చెప్పింది విని షాకయిన ఆమె పెదనాన్న కూతురు ఆ బాలికను వెంటబెట్టుకుని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో విషయం బయటకు వచ్చింది. పోలీసులు ఈ ఫిర్యాదుతో బాలిక తల్లిపై, ఆ సినీ దర్శకుడిపై కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలంకలో భారతీయ ఉన్నతాధికారిపై దాడి