Webdunia - Bharat's app for daily news and videos

Install App

జవాన్లు.. మీ ఆట అదిరింది.. వీరేంద్ర సెహ్వాగ్

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (13:16 IST)
పుల్వామా ఉగ్రదాడికి భారత ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‍లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత్‌కు చెందిన మిరాజ్ యుద్ధ విమానాలు మెరుపుదాడులు చేశాయి. ఈ దాడుల్లో దాదాపుగా 300 మంది ఉగ్రవాదులు వరకు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాయి. సర్జికల్ స్టైక్-2 పేరుతో నిర్వహించిన ఈ దాడులపై దేశం యావత్తూ హర్షం వ్యక్తం చేస్తోంది.
 
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ, 'జవాన్లు.. మీ ఆట అదిరింది' అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు ఎయిర్‌స్ట్రైక్‌ హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించాడు. మరొక మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ స్పందిస్తూ..'భారత్‌ ఆర్మీకి ఇదే నా సెల్యూట్‌' అని ట్వీట్‌ చేశాడు. ఇక గౌతం గంభీర్‌ 'జై హింద్ ఐఎఎఫ్' అంటూ ట్వీట్‌ చేశాడు. 
 
టీమిండియా యువ క్రికెటర్‌ యజ్వేంద్ర చహల్‌ భారత ఆర్మీని ప్రశంసించాడు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దేశం మొత్తాన్ని కలచివేసిన ఆ ఘటనకు ప‍్రతీకారంగానే ఉగ్రస్థావరాలపై భారత్‌ మరో మెరుపు దాడి చేసింది. ఈ ఘటనలో 200 నుంచి 300 వరకూ ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments