Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#Surgicalstrike2 : జైష్ కంట్రోల్ రూమ్ ఆల్ఫా-3 నేలమట్టం (Video)

#Surgicalstrike2 :  జైష్ కంట్రోల్ రూమ్ ఆల్ఫా-3 నేలమట్టం (Video)
, మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (10:38 IST)
పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ప్రతి రక్తపుబొట్టుకు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరిస్తూ వచ్చారు. దీనికి ప్రతీకారంగా భారత్ వైమానికదళం మంగళవారం వేకువజామున 3.30 గంటల సమయంలో సర్జికల్ స్ట్రైక్‌ను విజయవంతంగా నిర్వహించాయి. ఈ దాడుల కోసం మిరాజ్ రకం యుద్ధ విమానాలను ఉపయోగించారు. మొత్తం 12 విమానాలు ఉపయోగించారు. 
 
కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్థాన్‌పై భారత యుద్ధవిమానాలు విరుచుకుపడటం ఇదే ప్రథమం. దాదాపు 12 మిరేజ్ విమానాలు ఈ దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం. వెయ్యి కిలోల లేజర్ గైడెడ్ బాంబులను నియంత్రణరేఖ వద్ద ఉన్న ఉగ్ర తండాలపై మన వాయుసేన జారవిడిచింది. బాలాకోట్, చకోతీ, ముజఫరాబాద్‌లలోని లాంచ్ ప్యాడ్స్‌తో పాటు జైషే మొహమ్మద్‌కు చెందిన ఆల్ఫా-3 కంట్రోల్ రూమ్స్‌ను వాయుసేన ధ్వంసం చేసింది. 
 
ఈ దాడుల్లో దాదాపు 300 మంది జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ దాడులను పాకిస్థాన్ ధృవీకరించగా, భారత్ రక్షణ శాఖ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్జికల్ స్ట్రైక్స్-2 : జైషే స్థావరాలపై లేజర్ బాంబుల వర్షం... దాడులు నిజమేనన్న పాక్