Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సర్జికల్ స్ట్రైక్స్-2 : జైషే స్థావరాలపై లేజర్ బాంబుల వర్షం... దాడులు నిజమేనన్న పాక్

సర్జికల్ స్ట్రైక్స్-2 : జైషే స్థావరాలపై లేజర్ బాంబుల వర్షం... దాడులు నిజమేనన్న పాక్
, మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (09:54 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ భూభాగంలో ఉన్న జైషే ఈ మొహమ్మద్ స్థావరాలపై భారత్ వైమానిక దళాలు మంగళవారం వేకువజామున మెరుపుదాడులు చేశారు. ముఖ్యంగా, జైషే ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా లేజర్ గైడెడ్ బాంబుల వర్షం కురిపించాయి. 
 
భారత నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు భీకరదాడులు జరిపా​యి. బాలాకోట్, చాకోటి, ముజఫరాబాద్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు చెందిన కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. 12 మిరాజ్‌-200 యుద్ధ విమానాలతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌.. సర్జికల్‌ స్ట్రైక్‌ 2ను విజయవంతంగా పూర్తి చేసి పుల్వామా ఉగ్రదాడి జవాన్లకు ఘన నివాళులర్పించింది. 
 
అయితే, తమ భూభాగంలోకి వచ్చి భారత్ వైమానికదళాలు దాడులు చేసినట్టు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ధృవీకరించారు. "భారత్‌ సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలకు ప్రేరిపిస్తోంది. పాక్‌ వైమానిక దళం ఎదురు దాడి చేయడంతో భారత యుద్ద విమానాలు వెనక్కు వెళ్లాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని గఫూర్‌ స్పష్టం చేశారు. భారత్‌ వైమానిక దాడుల అనంతరం దానికి సంబంధించి ఫోటోలను పాక్‌ విడుదల చేసింది. అయితే ఈ దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.
 
అయితే, ఈ దాడులపై భారత రక్షణ శాఖ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరికొద్దిసేపట్లో ఈ దాడి గురించి అధికారికంగా మీడియా సమావేశంలో వెల్లడించనుంది. పుల్వామా దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. మరోవైపు శ్రీనగర్‌లోని వేర్పాటు వాదుల నివాసాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. వేర్పాటువాదులు యాసిన్‌, మిర్వాయిజ్‌, షబీర్‌ షా, ఆశ్రఫ్‌ ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దారి ఇవ్వమని అడిగినందుకు ఉంగరపు వేలిని కొరికేసిన కారు యజమాని...