Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు సంవత్సరాల జీతం విరాళమిచ్చిన గౌతమ్ గంభీర్

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (16:30 IST)
దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు సహాయంగా ప్రధాని సహాయనిధికి తన రెండు సంవత్సరాల జీతాన్ని విరాళంగా ప్రకటిస్తున్నట్లు ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా గౌతం గంభీర్ ప్రకటించారు.
 
''మనకు ఈ దేశం ఏం చేసిందని అందరూ ప్రశ్నిస్తుంటారు. కానీ, మనం దేశానికి ఏం చేశామన్నది నిజమైన ప్రశ్న. తన రెండు సంవత్సరాల జీతాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నానని తెలిపారు. ఈ మంచి పని కోసం మీరు ముందుకు రావాలని గంభీర్ ట్వీట్ ద్వారా పిలుపు నిచ్చారు.
 
గంభీర్‌తో పాటు ఇప్పటికే పలువురు క్రీడాకారులు, సెలబ్రిటీలు.. ఈ వైరస్‌పై పోరాటానికి సహాయార్థం తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షల విరాళం ప్రకటించగా, మాజీ కెప్టెన్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ పేదల కోసం రూ. 50 లక్షల విలువైన బియ్యాన్ని విరాళంగా ఇచ్చాడు. సురేశ్ రైనా రూ. 52 లక్షలు, అజింక్య రహానే రూ. 10 లక్షల సాయం ప్రకటించాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కూడా తన వంతు సాయం అందిస్తానని ముందుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments