Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా మహమ్మారి.. మూడు రోజుల పసికందుకు కరోనా.. తల్లికి కూడా?

కరోనా మహమ్మారి.. మూడు రోజుల పసికందుకు కరోనా.. తల్లికి కూడా?
, గురువారం, 2 ఏప్రియల్ 2020 (14:01 IST)
కరోనా మహమ్మారి దేశంలో వేటను మొదలెట్టేసింది. కరోనా కారణంగా వందలాది మంది పిట్టల్లా జారిపోతున్నారు. కానీ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పుట్టి మూడు రోజులే అయిన పసిబిడ్డకు కూడా కరోనా సోకింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ పసిగుడ్డుకు కరోనా వైరస్ సోకింది. పుట్టిన మూడు రోజులకే ఆ పసిపాపతో పాటు తల్లికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. 
 
కరోనా వైరస్ పేషెంట్ ఖాళీ చేసిన బెడ్‌ను తల్లీశిశువుకు కేటాయించడంతో.. తల్లీబిడ్డలకు కరోనా సోకినట్టు అనుమానిస్తున్నారు. ముంబైలోని చెంబూరులో ఉన్న సాయి ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన అతి తక్కువ వయసు బేబీ ఈ పసిపాపే కావడం గమనార్హం. అంతకుముందు లాక్ డౌన్ కారణంగా తాము 10 రోజులుగా ఇంట్లో నుంచి బయటకు రాలేదని.. ఆసుపత్రికి వచ్చాకే కరోనా సోకిందని వారి కుటుంబం ఆరోపిస్తోంది.
 
మార్చి 27వ తేదీ నుంచి ఒక్క నర్సు గానీ డాక్టర్ గానీ భార్యాబిడ్డలను పట్టించుకోలేదని.. తమను పూర్తిగా వదిలేశారని శిశువు ఆరోపించాడు. తమకు పుట్టిన మొదటి బిడ్డకే కరోనా పాజిటివ్‌గా తేలడం, తన భార్య కూడా కరోనా బారినపడటం బాధగా ఉందన్నాడు. 
 
మంగళవారం(మార్చి 30)న తన భార్యాబిడ్డలను కర్ల బాబా ఆసుపత్రికి.. అక్కడినుంచి కస్తూర్బా ఆసుపత్రికి తరలించినట్టు చెప్పాడు. ప్రస్తుతం అక్కడ 120 మంది కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. అతని భార్యాబిడ్డలను అదే ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచి.. అతన్ని కూడా క్వారెంటైన్ వార్డులో చేర్చారు. 
 
ఇకపోతే.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశం మొత్తంలో 2094 పాజిటివ్ కేసులు నమోదవగా.. మహారాష్ట్రలో అత్యధికంగా 338 మంది వైరస్ బారినపడ్డారు. అత్యధికంగా 39మంది ఈ రాష్ట్రంలోనే మృత్యువాతపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాతో లాక్ డౌన్.. జేఈఈ మెయిన్స్ వాయిదా