Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా.. విశ్వవిజేత ఖాతాలో చెత్త రికార్డు.. 85 పరుగులకే ఆలౌట్.. వాన్ ఫైర్

Webdunia
గురువారం, 25 జులై 2019 (16:30 IST)
ప్రపంచ కప్ గెలుచుకున్న ఇంగ్లండ్ జట్టుకు పది రోజుల్లోనే చుక్కలు కనిపించాయి. బుధవారం లార్డ్స్ వేదికగా ప్రారంభమైన ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ చేతిలో 23.4 ఓవర్లలో 85పరుగులకే ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ ఆలౌటైంది. తద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇంగ్లాండ్ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ఐర్లాండ్ బౌలర్లలో టిమ్ ముర్టాగ్(5/13) సత్తాచాటాడు. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో వరుసగా టపాటపా వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ జట్టులో ఏడుగురు బ్యాట్స్‌మన్ కనీసం రెండంకెల స్కోరును కూడా చేయలేకపోయారు. బెయిర్‌స్టో, అలీ, మార్క్ వుడ్‌లు డకౌట్‌గా వెనుదిరిగారు. జోయ్ డెన్లీ చేసిన 23 పరుగులే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేశాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 207 పరుగులకు ఆలౌటై.. 122 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
 
కాగా బుధవారం ఐర్లాండ్‌తో ప్రారంభమైన ఏకైక టెస్టులో 85 పరుగులకే ఆలౌటవ్వడం ఇంగ్లాండ్‌ జట్టుకు అవమానకరమని మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ పేర్కొన్నాడు. నిజం చెప్పాలంటే ఇది అవమానకరమని.. క్రికెట్‌ పుట్టిన గడ్డపై టెస్టు మ్యాచ్‌లో అది కూడా పసికూన లాంటి ఐర్లాండ్‌ చేతిలో 85 పరుగులకే ఆలౌట్ కావడం సిగ్గుచేటన్నాడు. చెత్తసాకులు చెప్పకండని.. ఈ రోజు చెత్తరోజుగా వాన్ అభివర్ణించాడు. 
 
కాగా, 1997లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లాండ్ 77 పరుగులకే ఆలౌటైంది. 22 ఏళ్ల తర్వాత మళ్లీ తక్కువ స్కోరుకు ఆలౌటవ్వడం ఇదే తొలిసారి. ఐర్లాండ్‌ జట్టుకు ఇది మూడో టెస్టు కావడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments