Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఊపిరి ఉన్నంతవరకు కివీస్‌కు సారీ చెబుతా (Video)

Advertiesment
ఊపిరి ఉన్నంతవరకు కివీస్‌కు సారీ చెబుతా (Video)
, సోమవారం, 15 జులై 2019 (13:33 IST)
తన ఊపిరి ఉన్నంతవరకు న్యూజిలాండ్ జట్టుకు క్షమాపణలు చెబుతూనే ఉంటానని ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ అంటున్నాడు. లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో ఇంగ్లండ్ జట్టు ఎవరూ ఊహించని విధంగా విశ్వవిజేతగా నిలిచింది. న్యూజిలాండ్ జట్టు తుదికంటా పోరాడి విజయం సాధించింది. కానీ, దురదృష్టం వెంటాడంతో రన్నరప్‌గా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచినప్పటికీ.. న్యూజిలాండ్‌కు మాత్రం జీవితాంతం సారీ చెబుతూనే ఉంటానని ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ అంటున్నాడు. 
 
ఎందుకంటే.. ఈ కథనం చదవాల్సిందే. ఆదివారం లార్డ్స్‌లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్. ఇంగ్లండ్ ఓటమి ఖాయమైపోయింది. కానీ, కొన్ని క్షణాల్లోనే సీన్ మారిపోయింది. ఇంగ్లండ్ విజయానికి చివరి ఓవర్లో 15 పరుగులు కావాల్సిన తురణంలో బౌల్ట్ వేసిన తొలి బంతికి పరుగు రాలేదు. దీంతో ఐదు బంతుల్లో ఇంగ్లండ్‌కు 15 పరుగులు కావాల్సివచ్చింది. రెండో బంతికి కూడా నో రన్. ఇంగ్లండ్ అభిమానుల నరాలు చిట్లి పోతున్నాయి. మూడో బంతికి స్టోక్స్ సిక్స్ బాదాడు. ఇంగ్లండ్ శిబిరంలో సంబరాలు.
 
ఆ తర్వాత మూడు బంతుల్లో 9 పరుగులు చేస్తే ఇంగ్లండ్ విజయం ఖాయం.  కానీ, విజయం మాత్రం ఇరు జట్ల మద్య దోబూచులాడింది. సరిగ్గా అప్పుడే ఎవరూ ఊహించని అద్భుతం జరిగింది. బౌల్ట్ వేసిన నాలుగో బంతిని స్టోక్స్ బలంగా బాదాడు. అయితే బంతి బౌండరీకి వెళ్లలేదు. ఒక పరుగు పూర్తి చేసుకున్న స్టోక్స్ రెండో పరుగుకు కూడా సిద్ధమయ్యాడు. 
 
క్రీజువైపు వేగంగా పరిగెత్తుకొస్తున్న వేళ తనకందిన బంతిని ఫీల్డర్ కీపర్ వైపు బలంగా విసిరాడు. అదే సమయంలో స్టోక్స్ క్రీజులో బ్యాట్ ఆనించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఫీల్డర్ విసిరిన బంతి స్టోక్స్ బ్యాట్‌కు తాకి బౌండరీకి వెళ్లింది. దీంతో ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు వచ్చాయి. సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇంగ్లండ్ విజయానికి రెండు బంతుల్లో మూడు పరుగులు కావాల్సివుండగా, రెండు పరుగులు తీయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
 
బంతి స్టోక్స్ బ్యాట్‌కు తాకి బౌండరీకి వెళ్లడంతో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. మరోవైపు బెన్‌స్టోక్స్ మైదానంలోనే రెండు చేతులు పైకెత్తి కివీస్‌ను క్షమాపణలు కోరాడు. తప్పు తనదేనన్నట్టు అంగీకరించాడు. తద్వారా క్రీడాస్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. 
 
మ్యాచ్ అనంతరం స్టోక్స్ మాట్లాడుతూ.. తన వల్ల జరిగిన పొరపాటుకు న్యూజిలాండ్‌కు తాను జీవితాంతం క్షమాపణలు చెబుతూనే ఉంటానని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని విలియమ్సన్‌కు కూడా చెప్పానని స్టోక్స్ వివరించాడు. అలా న్యూజిలాండ్ జట్టుకు స్టోక్స్ జీవితాంతం క్షమాపణలు చెబుతూనే ఉంటానని వెల్లడించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'గోల్డెన్ బ్యాట్' దక్కించుకున్న 'హిట్ మ్యాన్'