Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరల్డ్ కప్ : 14 పరుగులకే మూడు వికెట్లు డౌన్.. కష్టాల్లో ఆస్ట్రేలియా

వరల్డ్ కప్ : 14 పరుగులకే మూడు వికెట్లు డౌన్.. కష్టాల్లో ఆస్ట్రేలియా
, గురువారం, 11 జులై 2019 (15:52 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా - ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ పించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఇంగ్లండ్ బౌలింగ్ ధాటికి కేవలం 14 పరుగుకే మూడు ప్రధాన వికెట్లను కోల్పోయింది. 
 
ఆసీస్ ఓపెనర్లు ఆరోన్ పించ్ డకౌట్ కాగా, డేవిడ్ వార్న్ 9, హ్యాండ్స్‌కోంబ్ 4 చొప్పున పరుగులు చేశారు. 6.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 14 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుత మాజీ కెప్టెన్ స్మిత్, కీపర్ క్యారీలు నింపాదిగా ఆడుతున్నారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 28/3గా వుంది. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇంగ్లండ్ జట్టులో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే, ఆస్ట్రేలియా జట్టులో గాయపడిన ఉస్మాన్ ఖవాజా స్థానంలో హ్యాండ్స్ కోంబ్‌కు చోటు కల్పించారు. సొంతగడ్డపై జరుగుతున్నందున ఇంగ్లీష్ జట్టు ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 
 
ఇంగ్లండ్ ఫామ్‌లో ఉన్న తీరు కూడా ఆ జట్టుపై భారీ అంచనాలు కలిగిస్తోంది. ఇక మేజర్ టోర్నమెంట్లలో ఆస్ట్రేలియా ఆటతీరు ఓ మెట్టుపైకి చేరుతుంది. కీలకమైన మ్యాచ్‌ల్లో చిన్న అవకాశం దొరికినా చాలు, ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి ఉక్కిరిబిక్కిరి చేయడంలో ఆస్ట్రేలియా జట్టును మించిన జట్టు మరొకటి లేదని చెప్పొచ్చు. 
 
ఇరు జట్ల వివరాలు...
ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఆరోమ్ ఫించ్, స్మిత్, హ్యాండ్స్‌ కోంబ్, మ్యాక్స్‌వెల్, స్టాయిన్స్, క్యారీ, కుమ్మిన్స్, స్ట్రాక్, లిన్, బెహ్రాండెఫ్. 
 
ఇంగ్లండ్ జట్టు... 
జానసీ బెయిర్‌స్టో, జాసన్ రాయ్, రూట్, ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, క్రిస్ వోక్స్, లియామ్ ప్లుంకట్, అడిల్ రషీద్, జొఫ్రా అర్చెర్, మార్క్ వుడ్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్ : ఆస్ట్రేలియా బ్యాటింగ్