Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.2 వేల నోటు ఎక్కువా?... నాలుగు రూ.500 నోట్లు ఎక్కువా: అమితాబ్ బచ్చన్

Advertiesment
రూ.2 వేల నోటు ఎక్కువా?... నాలుగు రూ.500 నోట్లు ఎక్కువా: అమితాబ్ బచ్చన్
, మంగళవారం, 16 జులై 2019 (14:39 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా గత ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టును బౌండరీ విధానం ద్వారా విజేతగా ఎంపిక చేయడంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యంగ్యాస్త్రం సంధించారు. రూ.2 వేలు ఎక్కువా? లేదా నాలుగు రూ.500 నోట్లు ఎక్కువా? అని ప్రశ్నించారు. ఇపుడు ఇంగ్లండ్ - న్యూజిలాండ్ జట్ల పరిస్థితి అంతేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. 
 
ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. ఆ తర్వాత సూపర్ ఓవర్ నిర్వహిస్తే అది కూడా టైగానే ముగిసింది. అయినా బౌండరీ విధానం ద్వారా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించింది. మ‌రి అందుకు కార‌ణం ఏమంటే మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎక్కువ బౌండ్రీలు కొట్టింది అని తేల్చారు. ఈ విచిత్ర నిబంధ‌న‌పై క్రీడా విశ్లేష‌కులు, అభిమానుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు మండిప‌డుతున్నారు. 
 
తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కాస్త విభిన్నంగా స్పందించారు. మీ ద‌గ్గ‌ర రెండు వేల రూపాయ‌లు ఉంటే, నా ద‌గ్గ‌ర 2000 రూపాయ‌లు ఉన్నాయి. మీ ద‌గ్గ‌ర రెండు వేల రూపాయ‌ల నోటు ఒక‌టి ఉంటే, నా ద‌గ్గ‌ర 500 రూపాయ‌ల నోట్లు నాలుగు ఉన్నాయి. మ‌రి ఎవ‌రు ధ‌న‌వంతులు అంటే? 
 
రూ.500 నోట్లు నాలుగు ఉన్నోడే గొప్పోడు అని ఐసీసీ అంటుంద‌ని మెగాస్టార్ కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇక కొద్ది సేప‌టి క్రితం త‌న ఫ్రెండ్ పీయూష్ పాండే ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ పెట్టిన హెడ్‌లైన్‌ని నాకు ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్ విజ‌యం ఓవ‌ర్‌త్రోతో సాధ్య‌మైందని త‌న ట్వీట్‌లో తెలిపారంటూ బిగ్ బీ పేర్కొన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బౌండరీలతో గెలుపును లెక్కేస్తారా? ట్రెండ్ అవుతున్న #ICCRules హ్యాష్ ట్యాగ్