Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీని చూసే నేర్చుకున్నా.. నాక్‌కు మహీనే కారణం: చాహర్

Webdunia
గురువారం, 22 జులై 2021 (18:26 IST)
టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ మ్యాచ్‌లను ముగించే విధానాన్ని దగ్గరగా చూడటం తనపై తీవ్ర ప్రభావం చూపించిందని, అదే శ్రీలంకపై విన్నింగ్‌ నాక్‌ ఆడేలా చేసిందని టీమిండియా పేసర్‌ దీపక్‌ చాహర్‌ అన్నాడు. 
 
శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దీపక్‌ చాహర్‌ (69 నాటౌట్‌) అసాధారణ ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ విజయాన్నందించిన విషయం తెలిసిందే. టాపార్డర్‌ విఫలమైన వేళ ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో దీపక్‌ చాహర్‌ అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు. అయితే, ఈ విన్నింగ్‌ నాక్‌కు ధోనీనే కారణమని తెలిపాడు. 
 
''ఛేజింగ్‌లో ప్రతికూలతలు ఎదురైనప్పుడు మ్యాచ్‌ను చివరివరకు తీసుకెళ్లాలని ధోనీ పదే పదే చెప్పేవాడు. క్రీజులో పాతుకుపోవడానికి సమయం తీసుకోవాలంటాడు. అంతేకాకుండా చివర్లో బౌలర్లపై ఒత్తిడి నెలకొని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. 
 
వారి తప్పులను బ్యాట్స్‌మన్‌ అనుకూలంగా మార్చుకోగలిగితే బిగ్‌ షాట్స్‌తో సులువుగా మ్యాచ్‌ను ముగించవచ్చని చెప్పేవాడు. ఆ సూత్రంతోనే ఈ మ్యాచ్‌లో రాణించాను'' అని తెలిపాడు. కాగా, తన తండ్రే తన మొదటి కోచ్‌ అని దీపక్‌ చాహర్‌ స్పష్టం చేశాడు. చివరిదైన నామమాత్రపు మూడో వన్డే శుక్రవారం జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం
Show comments